1,000 కోట్ల రుణం ఇవ్వలేం!
సాక్షి, హైదరాబాద్: ఉద్యాన సంస్థకు రూ. 1,000 కోట్లు రుణం ఇవ్వాలని.. అందుకు పూచీకత్తు ఇస్తానని స్వయానా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా చివరకు నాబార్డు చేతులెత్తేసింది. కొర్రీల మీద కొర్రీలు వేసిన నాబార్డు చివరకు అసలు మాట బయటపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భారీగా రుణాలు తీసుకుందని.. ఇక తమ వల్ల కాదని తేల్చినట్లు తెలిసింది. రూ. వెరుు్య కోట్లు రుణం ఇవ్వడమంటే మాటలు కాదని పేర్కొన్నట్లు సమాచారం. దీంతో కంగారుపడిన రాష్ట్ర ప్రభుత్వం ముంబైలోని నాబార్డు ఉన్నతాధికారులను కలసి పరిస్థితి వివరించి ఎలాగైనా రుణం రాబట్టాలని యోచిస్తోంది. ఇందుకోసం వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆ శాఖ కార్యదర్శి సి.పార్థసారథిని పంపాలని నిర్ణరుుంచింది.
సూక్ష్మసేద్యం కోసమే ఇదంతా
2016-17లో 3.37 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసి రైతులకు మేలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఇందుకోసం ఈ ఏడాది రూ. 290 కోట్లు కేటారుుంచింది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ. 190 కోట్లు కేటారుుంచగా... కేంద్రం తన వాటాగా రూ. 100 కోట్లు ఇవ్వనుంది. అరుుతే ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ఈ సొమ్ము సరిపోదు. అందువల్ల నాబార్డు నుంచి రుణం తీసుకోవాలని నిర్ణరుుంచిన సంగతి తెలిసిందే. అరుుతే నేరుగా రుణం తీసుకోవడానికి సాంకేతిక కారణాలు అడ్డు రావడంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యానాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. దాని ద్వారా రుణం తీసుకొని సూక్ష్మసేద్యానికి మరలించాలని నిర్ణరుుంచింది. నాబార్డు మాత్రం మొదటి నుంచీ రూ. 1,000 కోట్ల రుణంపై కొర్రీలు పెడుతూ వచ్చింది. సూక్ష్మసేద్యం పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు నూటికి నూరు శాతం, బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీ ఇవ్వడం సరికాదని పేర్కొంది. ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ ఇస్తే... రైతులు 25 శాతం చెల్లించాల్సిందేనని నాబార్డు మెలిక పెట్టింది. ఈ వివాదం సీఎం వద్దకు వెళ్లినా నాబార్డు మాత్రం వెనక్కు తగ్గలేదు.