జగిత్యాలలో కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేస్తున్న మంత్రి ఈటల, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు
సాక్షి నెట్‌వర్క్: కొత్త జిల్లాల ఆవిర్భావ సంబురాలు రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఘనంగా జరి గాయి. కొత్త జిల్లాలు ఏర్పాటై అక్టోబర్ 11 నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్, పోలీసు కార్యాలయాల సముదా యాలకు మంత్రులు శంకుస్థాపనలు చేశారు. సిద్దిపేట, సిరిసిల్లల్లో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు సీఎం కేసీఆర్ శంకుస్థా పనలు చేయగా, మిగిలిన చోట మంత్రులు చేశారు. నిజామాబాద్‌లో కలెక్టర్ కార్యాలయ భవనానికి, కామారెడ్డిలో కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాల భవన సముదాయాలకు మంత్రి పోచారం శంకుస్థాపన చేశారు. ఎంపీ కవిత పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లిలో స్పీకర్ మధుసూదనాచారి, జనగామలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిలు శంకుస్థాపన చేశారు.
జనగామలో జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి టీజేఏసీ చైర్మన్ కోదండరాం హాజరయ్యారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయ నిర్మాణానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి భూమి పూజ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధి రాయగిరి వద్ద జిల్లా కలెక్టర్ సమీకృతశాఖల భవన సముదాయాలకు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. వికారాబాద్‌లో రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి భూమి పూజ చేశారు.
వనపర్తిలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు, పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవన నిర్మా ణాలకు హోం మంత్రి నాయిని శంకుస్థాపనలు చేశారు. జగిత్యాల జిల్లాలో మంత్రి ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ కవితతో కలసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా వేడుకలు హన్మకొండలోని అంబేడ్కర్ భవన్‌లో జరిగాయి. మహబూబాబాద్ జిల్లాలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా కార్యక్రమంలో స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు పాల్గొన్నారు.
నేడు సూర్యాపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
సాక్షి, సూర్యాపేట: సీఎం కేసీఆర్ గురువారం సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. పట్టణంలోని గొల్లబజార్‌లో నిర్మించిన డబు ల్ బెడ్రూం ఇళ్లను మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి ప్రారంభిస్తారు. ఆ తర్వాత కుడకుడలో కొత్త సమీకృత కలెక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యా లయ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం చివ్వెంల పీహెచ్‌సీని సందర్శిస్తారు. వట్టికమ్మం పహాడ్‌లో నిర్మిం చిన 400 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను, చందు పట్లలో మిషన్‌భగీరథ పథకాన్ని ప్రారంభి స్తారు. ఆ తర్వాత చందుపట్లలోని మోడల్ అంగన్‌వాడీ, హాస్టల్‌ను సీఎం సందర్శించే అవకాశం ఉంది. ఆయా కార్యక్రమాల తర్వాత సూర్యాపేటలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.
Comments
Please login to add a commentAdd a comment