అప్పుడే రైతుకు రుణ విముక్తి
⇒ పంట ఉత్పత్తి, గిట్టుబాటు ధర, నికరాదాయం పెరగాలి..
⇒ ఆ దిశగా శాస్త్రవేత్తలు, అధికారులు కృషి చేయాలి
⇒ వ్యవసాయ మంత్రి పోచారం
సాక్షి, హైదరాబాద్: పంట ఉత్పత్తి, గిట్టుబాటు ధర, నికరాదాయం.. ఈ మూడు పెరిగితేనే రైతులు రుణ విముక్తులవుతారని, ఆ దిశగా శాస్త్రవేత్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ మేనేజ్‌మెంట్ (నార్మ్)లో సోమవారం జరిగిన ‘వ్యవసాయంలో నైపుణ్యాభివృద్ధి’పై వర్క్‌షాప్‌ను పోచారం ప్రారంభించారు. మొత్తం 8 రాష్ట్రాల నుంచి 400 మంది వ్యవసాయ రంగ నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో వ్యవసాయంపై వచ్చే ఆదాయం రైతుల జీవన వ్యయానికే సరిపోతుంటే ఇక వారి కుటుంబాలకు మెరుగైన జీవితం ఎలా అందుతుందని ప్రశ్నించారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి కానీ అంతే మొత్తంలో రైతుల ఆదాయాలు పెరగలేదని పేర్కొన్నారు.
డిపాజిట్ చేయడానికి రైతులు రావాలి..
కేంద్ర బడ్జెట్‌లో ప్రతి ఏడాది వ్యవసాయ రుణాలను పెంచుతున్నారని, అసలు రుణమే అవసరం లేకుండా సొంతంగా పెట్టుబడుల ను సమకూర్చుకోగలిగే స్థితికి రైతులు చేరుకోవాలని ఆకాంక్షించారు. రైతులు రుణాల కోసం కాదు లాభాలను డిపాజిట్ చేయడానికి బ్యాంకులకు వచ్చే రోజు రావా లన్నారు. 1947లో 50 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉన్న దేశ ఆహారధాన్యాల దిగుబడులు 2017లో 272 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరడం సంతోషమన్నారు. అయితే సగటు దిగుబడులను ఇతర దేశాలతో పోల్చినప్పుడు తక్కువగా ఉన్నాయని తెలిపారు.
పాలీహౌస్‌లకు ప్రోత్సాహం
రాష్ట్రంలో పాలీహౌస్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం అధిక ప్రోత్సాహం కల్పిస్తుందని పోచారం తెలిపారు. ఎకరాకు రూ.40 లక్ష లు ఖర్చు కాగా.. రూ.30 లక్షలు సబ్సిడీగా సమకూరుస్తున్నామని వివరించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటి వరకు 1,000 ఎకరాల్లో పాలీహౌస్‌ల నిర్మాణానికి అను మతులిచ్చామని వెల్లడించారు. వచ్చే ఏడా ది 3,000 ఎకరాల్లో నిర్మించడానికి సహకా రం అందించాల్సిందిగా కేంద్ర వ్యవసాయ మంత్రిని కోరగా.. ఆయన అంగీకరించా రని తెలిపారు. వ్యవసాయ రంగం బాగుప డాలంటే సాంకేతికత, పెట్టుబడులు, యాంత్రీకరణ పెరగాలని పేర్కొన్నారు.