
హవేలి ఘణాపూర్ (మెదక్): పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచితే పొలాలకు ముప్పు తప్పదని మెదక్, కామారెడ్డి జిల్లాల రైతు లు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు జిల్లాల సరిహద్దులో ఉన్న పోచారం అభయార ణ్యంలో బుధవారం వీరంతా సమావేశమ య్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పోచారం ప్రాజెక్టు ఎత్తును పెంచే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ప్రాజెక్టు ఎత్తుతో మెదక్ జిల్లా హవేలి ఘణాపూర్ మండల పరిధిలోని రాజ్‌పేట, పోచమ్మ రాల్, కొత్తపల్లి, బూర్గుపల్లి, కామారెడ్డి జిల్లా గోపాల్‌పేట మండల పరిధిలోని వదల్‌పర్తి, శెట్టిపల్లి సంగారెడ్డి, పొల్కం పేట పరిధిలోని వేల ఎకరాల పంట పొలా లు నీట మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే పోచారం ప్రాజెక్టు నిండినప్పుడు పలు గ్రామాల్లోని పొలాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. ఎన్నికలకు ముందు వ్యవసాయశాఖ మంత్రి పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచబోమని హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కోరారు. రైతు విధానాలకు వ్యతిరేకంగా పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తే రైతులందరం పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment