విత్తనాలలో కల్తీని నిరోధించేందుకు త్వరలోనే సమగ్రమైన విత్తన చట్టం ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పారు. దేశంలో తెలంగాణ విత్తనాలు అంటే కళ్లు మూసుకుని కొనేలా విత్తన నాణ్యత ఉండాలని సూచించారు. ఈ ప్రయోగశాల వల్ల తెలంగాణ కీర్తిప్రతిష్టలు ప్రపంచవ్యాప్తం అయ్యేలా కృషి చేయాలని పోచారం కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు, ఎం.జగన్మోహన్, డాక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు అమ్మితే కొట్టుకుంటూ తీసుకెళ్లాలి
Published Wed, Jun 14 2017 12:57 AM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM
వ్యవసాయ మంత్రి పోచారం వ్యాఖ్య
హైదరాబాద్: నకిలీ విత్తనాలు విక్రయించే వారి చేతులకు బేడీలు వేసి రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్లాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తెలంగాణ విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ రూ. 6.19 కోట్లతో కొత్తగా నిర్మిస్తున్న విత్తన నాణ్యత పరీక్ష ప్రయోగశాల భవనానికి మంగళవారం మండలి చైర్మన్ స్వామి గౌడ్‌తో కలిసి ఆయన భూమిపూజ, శంకుస్థాపన చేశారు.

Advertisement
Advertisement