ధ్రువీకరించిన విత్తనాలే అమ్మాలి!
• దీన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం చట్టం చేయాలి: మంత్రి పోచారం
• హైదరాబాద్‌లో ప్రారంభమైన అంతర్జాతీయ విత్తన సదస్సు
సాక్షి, హైదరాబాద్: నకిలీ, నకిలీ,నాసిరకం విత్తనాలకు కళ్లెం వేయాలంటే.. తప్పనిసరిగా ప్రభుత్వం ధ్రువీకరించిన విత్తనాలనే కంపెనీలు విక్రరుుంచేలా కేంద్రం చట్టం చేయాలని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని ఆయన తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఓఈసీడీ విత్తన ధ్రువీకరణ వర్క్‌షాప్ ప్రారంభమైం ది. రెండ్రోజులపాటు జరిగే ఈ వర్క్‌షాప్‌కు దేశవ్యాప్తంగా ఉన్న పలు విత్తన కంపెనీలు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ విత్తన ధ్రువీకరణ సంస్థల అధికారులు, వివిధ దేశాలకు చెందిన విత్తన ధ్రువీకరణ నిపుణులు హాజరయ్యారు.
మంత్రి పోచారం మాట్లాడుతూ విత్తన కంపెనీలు తమ విత్తనాలన్నింటినీ ధ్రువీకరణ చేసుకునేలా 1966 విత్తన చట్టం లో మార్పులు చేయాలని సూచించారు. దీనిపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు లేఖ రాస్తామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి విత్తన ధ్రువీకరణ దరఖాస్తు ప్రక్రియను ఆన్‌లైన్ చేయాలన్నారు. రాష్ట్రంలో వివిధ విత్తన కంపెనీలు 83 గ్రామాలను దత్తత తీసుకున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘విత్తన గ్రామం’కార్యక్రమం ద్వారా 60 వేల మంది రైతుల సహకారంతో విత్తనోత్పత్తి చేస్తున్నామని తెలిపారు. ఇటీవల ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో నకిలీ మిరప విత్తనాల కారణంగా 2,500 మంది రైతులు నష్టపోయారని.. దోషులపై కఠిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 400 విత్తన కంపెనీలు రూ.4 వేల కోట్ల విలువైన విత్తనాలను సరఫరా చేస్తున్నాయని, దేశ అవసరాల్లో 60 శాతం విత్తనాలు రాష్ట్రం నుంచే వెళ్తున్నాయని చెప్పారు.
2019లో ‘ఇష్టా’సమావేశం
2019లో అంతర్జాతీయ విత్తన పరీక్ష సంస్థ (ఇష్టా) సమావేశం తెలంగాణలో జరుగనుం దని కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి (విత్తన) రాజేశ్‌కుమార్‌సింగ్ తెలి పారు. ఓఈసీడీ విత్తన ధ్రువీకరణ జాబితా లో మరో 42 వివిధ పంట రకాలను చేర్చామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ డెరైక్టర్ కె.కేశవులు, వ్యవసాయశాఖ కమిషనర్ జగన్‌మోహన్, జాతీయ విత్తన సంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, దక్షిణాఫ్రికాకు చెందిన ఓఈసీడీ నిపుణులు ఎడ్డి గోల్డ్‌సాజ్, గైహాల్ పాల్గొన్నారు.