తనకూ రిటైర్మెంట్ సమయం దగ్గరపడిందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
మంత్రి పోచారం వ్యాఖ్య
బాన్సువాడ: తనకూ రిటైర్మెంట్ సమయం దగ్గరపడిందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన కామారెడ్డి జిల్లా బాన్సు వాడ ఏరియా ఆసుపత్రిలో స్వచ్ఛంద ఆరోగ్య నేస్తాన్ని ప్రారంభించారు. తనతో కలిసి పాఠశాలలో చదివిన స్నేహితులను గుర్తు చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ మిత్రులంతా రిటైరయ్యారని, కానీ తాను ఇంకా రిటైర్ కాకుండా ప్రజాసేవ చేస్తున్నానని పేర్కొన్నారు.