గల్ఫ్‌కూ తాకిన నోట్ల రద్దు సెగ | Currency effect to Gulf also | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌కూ తాకిన నోట్ల రద్దు సెగ

Published Mon, Nov 21 2016 1:58 AM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM

గల్ఫ్‌కూ తాకిన నోట్ల రద్దు సెగ - Sakshi

గల్ఫ్‌కూ తాకిన నోట్ల రద్దు సెగ

విదేశాల నుంచి నిలిచిన ‘మనీ ట్రాన్‌‌సఫర్’
- ఇబ్బందుల్లో గల్ఫ్ కార్మిక కుటుంబాలు
- అక్కడ డబ్బులున్నా.. ఇంటికి పంపలేని వైనం
- రోజుకు రూ. 20 కోట్ల నుంచి 30 కోట్ల వ్యాపారం
 
 మోర్తాడ్: పెద్దనోట్ల రద్దు సెగ.. గల్ఫ్‌లోని మన కార్మికులకు తగులుతోంది. అక్కడ పని చేస్తున్న కార్మికులు వారు పొందిన వేతనాలను మనీ ట్రాన్‌‌సఫర్ కేంద్రాల ద్వారా స్వగ్రామాల్లోని తమ కుటుంబాలకు పంపిస్తారు. అయితే, మన దేశంలో రూ.500, రూ. 1000 నోట్లు రద్దు కావడం, బ్యాంకుల నుంచి పరిమితంగానే నగదును డ్రా చేసుకోవడానికి అవకాశం ఇవ్వడంతో మనీ ట్రాన్‌‌సఫర్ కేంద్రాల నిర్వహణ పూర్తిగా స్తంభించిపోరుుంది. మనీ ట్రాన్‌‌సఫర్ కేంద్రాలకు ప్రైవేటు బ్యాంకుల్లో ఖాతాలు న్నా నగదు డ్రా చేయడంపై ప్రభుత్వం సీలింగ్‌ను విధించడం, కొత్తగా విడుదల చేసిన నోట్లు ఇవ్వడంలో జాప్యం జరగడం తో మనీ ట్రాన్‌‌సఫర్ కేంద్రాలు తమ లావాదే వీలను నిర్వహించలేక పోతున్నాయి. గల్ఫ్ దేశాలైన దుబాయ్, సౌదీ అరేబియా, ఖతర్, ఇరాక్, మస్కట్, కువైట్, అబుదాబీ తదితర దేశాల్లో తెలంగాణ జిల్లాలకు చెందిన దాదాపు 5 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు.

వీరిలో అనేక మంది తమ వేతనాలను ఎప్పటికప్పుడు ఇంటికి పంపిస్తుంటారు. గల్ఫ్ దేశాల నుంచి మనీ ట్రాన్‌‌సఫర్ కేంద్రాల ద్వారా రోజుకు రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు లావాదేవీలు కొనసాగుతాయని అంచనా. గల్ఫ్‌లో మన దేశానికి సంబంధించిన బ్యాం కుల శాఖలు ఉన్నా కార్మికులు ఎక్కువగా మనీ ట్రాన్‌‌సఫర్ కేంద్రాలనే ఆశ్రరుుస్తు న్నారు. బ్యాంకు ఖాతాల్లో పంపే డబ్బును ఇక్కడివారు తీసుకోవడానికి కొంత సమ యం పడుతుంది. మనీ ట్రాన్‌‌సఫర్ కేంద్రాల ద్వారా పంపించే సొమ్మును క్షణాల్లో తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో అక్కడి వారంతా మనీ ట్రాన్‌‌సఫర్ కేంద్రాలనే ఆశ్రయిస్తారు. ఈ క్రమంలో గల్ఫ్‌లోని కార్మికులు అక్కడ ఉన్న మనీ ట్రాన్‌‌సఫర్ కేంద్రాలలో సొమ్ము జమ చేస్తున్నా ఇక్కడ తమవారికి మాత్రం ఆ సొమ్ము అందే లేకుండా పోరుుందని ఆవేదన వ్యక్తమవుతోంది. గల్ఫ్ నుంచి తమవారు సొమ్ము పంపిస్తున్నా ఇక్కడ ఉన్న వారికి డబ్బులు పొందే అవకాశం లేక పోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.

 అక్కడి కార్మికుల వద్ద ఇక్కడి కరెన్సీ
 గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న కార్మికులు ముందు జాగ్రత్త చర్యగా మన కరెన్సీని కొంత దాచుకుంటారు. సెలవు సమయంలో ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు సదరు సొమ్ము ఖర్చులకు ఉపయోగపడ తాయనే ఉద్దేశంతో ప్రతి కార్మికుడు మన కరెన్సీని తన దగ్గర కొంత దాచుకుంటాడు. ఒక్కో కార్మికుడి వద్ద రూ.వెరుు్య నుంచి రూ.5 వేల వరకు మన కరెన్సీ ఉంటుంది. అరుుతే, మన దేశంలో రూ.500, రూ.వెరుు్య నోట్లు రద్దు కావడంతో గల్ఫ్‌లో ఉన్న కార్మికులు అయోమయంలో పడ్డారు. గతంలో గల్ఫ్‌లో మన కరెన్సీని మార్చుకోవడానికి మనీ ట్రాన్‌‌సఫర్ కేంద్రాలు అనుమతి ఇచ్చేవి. ఇప్పుడు గల్ఫ్‌లోని మనీ ట్రాన్‌‌సఫర్ కేంద్రాలు మన కరెన్సీని తీసుకోవడం లేదు. గల్ఫ్ దేశాల్లో మన బ్యాంకులు ఉన్నా.. అవి గల్ఫ్ చట్టాలకు అనుగుణంగానే పనిచేస్తారుు. విదేశాల్లో మన కరెన్సీతో వ్యాపారం చేయడం ఫెమా చట్టం ప్రకారం నేరం. అందువల్ల గల్ఫ్ దేశాల్లోని మన కార్మికుల వద్ద ఉన్న కరెన్సీ చెత్తబుట్టపాలు అవుతోంది. ఒక్కో కార్మికుని వద్ద రూ. వెరుు్య చొప్పున మన కరెన్సీ ఉంటే దాని విలువ రూ.50 కోట్ల వరకు ఉంటుంది. ఈ కరెన్సీని ఎలాగైనా మార్చుకోవడానికి విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేయాలని గల్ఫ్‌లో ఉన్న కార్మికులు కోరుతున్నారు.
 
 మా కొడుకు డబ్బులు పంపించానని చెప్పాడు
 మా కొడుకు తెడ్డు సతీష్ మూడు నెలల కింద దోహఖతర్‌కు వెళ్లాడు. అక్కడ ఆఫీస్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు. వారం రోజుల కింద ఫోన్ చేసి డబ్బులు పంపిస్తున్నానని చెప్పాడు. వెస్టర్న్‌మనీ సెంటర్‌కు వెళ్లాం, కోడ్ నంబర్ చెప్పా.. డబ్బులు మా పేరుమీద వచ్చారుు కానీ, ఇప్పుడు ఇవ్వడం కుదరదంటున్నారు. డబ్బులు ఎప్పుడు ఇస్తామో ఇప్పుడు చెప్పలేమన్నారు.
                  - తెడ్డు రాజు, దశరథ్ మోర్తాడ్
 
  చెక్ ఇస్తామంటున్నారు

 నేను బెహరాన్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నా.. నా భార్యకు ఆరోగ్యం బాగాలేక నెల రోజుల కింద ఇంటికి వచ్చాను. కంపెనీ వారు నాకు రూ.25 వేల జీతం డబ్బులు ఇవ్వాల్సి ఉంది. నేను ఇండియాకు వచ్చేటప్పుడు కంపెనీ మేనేజర్ లేకపోవడంతో నా స్నేహితుడిని జీతం తీసుకుని పంపమన్నాను.  నా జీతం డబ్బులు నా స్నేహితునికి ఇచ్చారు. యూఏ ఈ ఎక్ఛ్సేంజ్‌కు పంపితే చెక్ ఇస్తామంటున్నారు.
           - రాకేష్, తొర్తి (బెహరాన్‌లో డ్రైవర్)
 
 జీతం పంపానని చెప్పాడు
 నా కొడుకు సారుుకుమార్ దుబాయ్‌లో పని చేస్తున్నా డు. ప్రతి నెలా 10న నా కొడుకు జీతం వస్తుంది. జీతం పైసలు ఎప్పటి లెక్కనే వెస్టర్న్‌మనీ సెంటర్‌లో పంపించాడు. వారు డబ్బులివ్వడంలేదు. బాకీలోల్లకు వడ్డీ కట్టాల్సి ఉంది. చిట్టీలు కట్టాల్సి ఉంది. వెస్టర్న్ మనీ సెంటర్‌లో ఎప్పుడైనా పది నిమిషాల్లో పైసలిచ్చేటోల్లు ఎప్పుడిత్తమో తెల్వదంటాండ్లు.
 - సాయమ్మ, మోర్తాడ్
 
 డబ్బులు చేతికందక ఇబ్బంది
 నా కొడుకు సంజీవ్ ఖతర్‌లో పని చేస్తున్నాడు. ప్రతి నెలా 5వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య జీతం డబ్బులు పంపిస్తాడు. ఈసారి కూడా జీతం తీసుకున్నా.. బ్యాంకులల్ల పైసలు ఇస్తలేరనీ, మనీ ట్రాన్స్‌ఫర్ సెంటర్ వాళ్లుకూడా డబ్బులు ఇవ్వడం లేదని నా కొడుకు చెప్పిండు. మరి ఏం చేస్తం. కొన్నిరోజులైన తర్వాత డబ్బు పంపిస్తానని అతను ఫోన్ చేసిండు. కానీ, మాకు ఇబ్బందిగానే ఉంది.                               
- లక్ష్మి, మోర్తాడ్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement