‘అవంతి’ అమానుషం! | Cashier Suicide | Sakshi
Sakshi News home page

‘అవంతి’ అమానుషం!

Published Sat, Nov 19 2016 1:28 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

‘అవంతి’ అమానుషం! - Sakshi

‘అవంతి’ అమానుషం!

- పాత నోట్లు మార్చాలంటూ అవంతి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం వేధింపులు..
- తట్టుకోలేక క్యాషియర్ ఆత్మహత్యాయత్నం!
 
 సాక్షి, విశాఖపట్నం/భోగాపురం: పెద్ద నోట్ల రద్దు వ్యవహారం విశాఖ జిల్లా తగరపువలస సమీపంలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న ఓ క్యాషియర్ ప్రాణం మీదకు తెచ్చింది. పాత నోట్లు మార్చాలంటూ కళాశాల యాజమాన్యం తీవ్ర ఒత్తిడి తేవడంతో తట్టుకోలేని పరిస్థితుల్లో క్యాషియర్‌గా పనిచేస్తున ్న రెరుు్య సూర్యనారాయణ(58) శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. యాజమాన్య వేధింపులు భరించలేకే ఆయన ఇందుకు ఒడిగట్టినట్టు భావిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. అరుుతే ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా సర్దుబాటు చేయాలని అధికారపార్టీ ఎంపీ అవంతి శ్రీనివాస్ బంధువులు, కళాశాల నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సంఘటనను కవర్ చేయకుండా మీడియాపై ఆంక్షలు విధించారు. ఒక్క పోలీసును కూడా సంఘటన జరిగిన ప్రాంతానికిగానీ, ఆస్పత్రికిగానీ రాకుండా కట్టుదిట్టం చేశారు. బంధువులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నారుు.

 విపరీతమైన ఒత్తిడి..: జీవీఎంసీ 4వ వార్డు రేవళ్లపాలెంలో భార్య, ముగ్గురు పిల్లలతో నివాసముంటున్న సూర్యనారాయణ విశాఖ జిల్లా తగరపువలస సమీపంలో ఉన్న అవంతి శ్రీనివాస్‌కు చెందిన అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభం నుంచి పనిచేస్తున్నారు. అరుుతే ఇటీవల పెద్ద నోట్లను కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో వాటిని మార్చాలంటూ యాజమాన్యం  ఆయనపై  ఒత్తిడి తెచ్చింది. నాలుగు రోజులుగా రాత్రిళ్లు ఇంటికి కూడా వెళ్లనివ్వకుండా ఆయన్ను కళాశాలలోనే ఉంచేశారు. అరుుతే ఆయన కుటుంబీకులకు శుక్రవారం తెల్లవారుజాము 5 గంటల సమయంలో యాజమాన్యం ఫోన్ చేసి.. తెల్లవారుజాము 3.30 గంటల ప్రాంతంలో కళాశాల సమీపంలోని జాతీయరహదారి వద్ద సూర్యనారాయణ పడి ఉన్నారని, వచ్చి తీసుకెళ్లాలని చెప్పారు. కుటుంబసభ్యులు  వివరాలడిగితే చలనం లేకుండా పడివున్నట్టు మాత్రమే చెప్పి ఫోన్ పెట్టేశారు.వారు సంఘటనాస్థలికి వచ్చేలోగానే కళాశాల యాజమాన్యం ఆయన్ను సంగివలస ఎన్‌ఆర్‌ఐ జనరల్ ఆసుపత్రిలోని క్యాజువల్ వార్డులో చేర్చించింది. పరిస్థితి విషమంగా ఉండటంతో  కేజీహెచ్‌కి తరలించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement