గ్యాస్‌కు నగదు బదిలీ
Published Sun, Sep 1 2013 3:01 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: వంట గ్యాస్‌కు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే నగదు బదిలీ పథకం ఆదివారం నుంచి జిల్లాలో అమలు కానుంది. దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని దశలవారీగా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రెండో దశలో శ్రీకాకుళం జిల్లాను చేర్చడంతో సెప్టెంబర్ ఒకటో తేదీ(ఆదివారం) నుంచి జిల్లాలోని వంట గ్యాస్ వినియోగదారులకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు కలెక్టర్ సౌరభ్ గౌర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్యాస్ నెంబర్, ఆధార్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకున్న వారికే ఈ పథకం కింద గ్యాస్ సబ్సిడీ లభిస్తుందన్నారు.
అయితే ఇప్పటివరకు ఆధార్ నెంబర్‌ను నమోదు చేసుకోని వారికి మూడు నెలల సమయం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అంతవరకు వీరికి ఇప్పటిలాగే సబ్సిడీ ధరకే గ్యాస్ సిలెండర్ సరఫరా చేస్తారన్నారు. జిల్లాలో 2.90 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు 1.78 లక్షల మంది వినియోగదారులే గ్యాస్ డీలర్ల వద్ద ఆధార్ నమోదు చేసుకున్నారని చెప్పారు. అదే సమయంలో బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకున్న వారి సంఖ్య 53 వేలు మాత్రమే వివరించారు. బ్యాంకు ఖాతాలు, గ్యాస్ ఏజెన్సీల్లో ఆధార్ పూర్తిస్థాయిలో నమో దు చేయించుకున్న వారికి గ్యాస్ సిలెండర్‌పై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఇక నుంచి నేరుగా వారి ఖాతాలోకి జమ అవుతుందని, సిలెండర్‌ను మాత్రం పూర్తిసొమ్ము చెల్లిం చి కొనుగోలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
నమోదుకు మూడు నెలల గడువు
ఇప్పటి వరకు డీలర్ల వద్ద, బ్యాంకుల వద్ద నమోదు చేసుకోని గ్యాస్ వినియోగదారులు నవంబరు 30లోగా నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని కలెక్టర్ చెప్పారు. ఈ అవకాాశాన్ని గ్యాస్ వినియోగదారులు సద్వినియోగం చేసుకొని వెంటనే డీలర్ల వద్ద, బ్యాంకుల వద్ద నమోదు చేయించుకొని రాయితీ పొందాలని సూచించారు. అంతకు ముందు హెచ్‌పీసీఎల్ సేల్స్ మేనేజర్ సునీల్‌కుమార్, హెచ్‌పీ గ్యాస్ డీలర్లు శ్రీనివాసరావు, డి. రవీంద్ర జిల్లా కలెక్టర్‌ను కలసి ఎల్‌పీజీ వినియోగదారులకు సెప్టెంబరు 1 నుంచి వర్తిం చే నగదు బదిలీ పథకం గురించి వివరించారు.
విశ్రాంత పోలీసులకు సన్మానం
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాలో సాయుధ దళంలో పనిచేసి శనివారం పదవీ విరమణ చేసి న ఏఆర్‌హెచ్‌సీలు ఆర్.కృష్ణ మూర్తి, వై.చల పతిరావు, ఎన్. తవిటినాయుడులను ఎస్పీ నవీన్‌గులాఠీ పుష్పగుచ్ఛం, దుశ్శాలువలతో సన్మానించారు. విశ్రాంత జీవితం ఆనంద దాయకంగా సాగాలని ఆకాంక్షించారు. కార్య క్రమంలో ఏఎస్పీ సింథల్ కుమార్, ఏఆర్ ఆర్ ఐ ప్రసాదరావు, డీసీఆర్‌బీసీఐ సీహెచ్‌జీవీ ప్రసాద్, ఎస్‌బీసీఐ సతీష్‌కుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement