ప్రధాన మంతి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా రైతులకు నూతన సంవత్సర కానుకను అందించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం-కిసాన్) పథకం కింద 10వ విడత నగదును రైతుల ఖాతాల్లోకి జమచేసింది. సుమారు 10 కోట్లకు పైగా లబ్ధిదారులైన రైతు కుటుంబాలకు రూ. 20,000 కోట్లకు పైగా నగదు బదిలీని కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది.
అట్టడుగు రైతులకు సాధికారత కల్పించాలనే ప్రధాని మోదీ నిబద్ధత, సంకల్పానికి అనుగుణంగా నగదు బదిలీ జరిగిందని ప్రధాన మంత్రి కార్యాలయం పీఎంవో ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6,000 ఇవ్వనుంది. నాలుగు-నెలల వాయిదాలలో రూ. 2,000 చొప్పున ప్రభుత్వం రైతులకు చెల్లిస్తోంది. ఈ పథకంలో భాగంగా రైతులకు ఇప్పటివరకు రూ. 1.6 లక్షల కోట్లు బదిలీ అయ్యాయి. అయితే పదో విడత నగదు ఖాతాలో పడ్డాయో లేదో అనేది సులభంగా తెలుసుకోవచ్చు. కొందరికి ఎస్ఎమ్ఎస్ రూపంలో మెసేజ్ లు కూడా వస్తాయి. ఒకవేల మెసేజ్ రాకపోతే ఈ క్రింది విధంగా చెక్ చేస్తే సరిపోతుంది.
స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా..!
- పీఏం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inకు వెళ్లి, మెనూ బార్ లో ఉన్న 'ఫార్మర్స్ కార్నర్' పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీకు మూడు ఆప్షన్ లు కనిపిస్తాయి (ఎ) ఆధార్ సంఖ్య, (బి) బ్యాంక్ ఖాతా సంఖ్య, (సి) మొబైల్ నంబర్. ఇందులో ఏదైనా ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మీరు చెల్లింపు చెక్కు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
- ఆధార్ నంబర్, అకౌంట్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత, మీరు 'గెట్ డేటా' ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీకు స్క్రీన్ మీద నగదు జమ అయ్యిందో లేదో మీకు చూపిస్తుంది.
- రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్‌ఎఫ్‌టీ(రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్)ని ఆమోదించిన తర్వాత ప్రభుత్వం ఎఫ్‌టిఒ(ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) కనిపిస్తుంది. ఒకవేల మీకు రాకపోతే ముందుగా స్థానిక వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించండి. అలాగే, పీఏం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ 011-24300606కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉంటేనే నగదు వస్తాయనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment