ఆన్‌లైన్ వేదికగా సైబర్ నేరస్థులు కొత్త మోసాలకు తెర తీస్తున్నారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్, పేటీఎం, ఫోన్‌పే, జీపే వంటి థర్డ్‌పార్టీ మోబైల్ యాప్‌ల ద్వారా నగదు లావాదేవీలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని, తెలియని నంబర్ నుంచి మెసేజ్‌లు, లింకులు వస్తే వాటిని ఓపెన్ చేయకూడదని సైబర్ పోలీసులు తెలియజేస్తున్నారు. సైబర్ కేటుగాళ్లు చిన్నమొత్తాల్లో ఖాతాల్లోకి డబ్బు పంపించి తిరిగి ఆ ఖాతాలను లూటీ చేసేలా ప్రయత్నిస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల సైబర్ మోసగాళ్లు ఫోన్‌పే, జీపే, పేటీఎం వంటి థర్డ్‌పార్టీ పేమెంట్ యాప్‌ల ద్వారా తక్కువ మొత్తంలో నగదును ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. దాంతో డబ్బు అందుకున్న వారికి మెసేజ్ వస్తుంది. దాన్ని ఆసరాగా చేసుకుని, వారిని నమ్మించి ‘మీ ఖాతాలో నగదు జమైంది. ఈ లింక్‌పై క్లిక్ చేయండి’అంటూ మెసేజ్‌లో కింద లింక్ ఇస్తున్నారు. లింక్ క్లిక్ చేస్తే పిన్ జనరేట్ చేయమనేలా అడుగుతుంది. పొరపాటున పిన్ జనరేట్ చేస్తే బ్యాంకు ఖాతాలోని డబ్బు ట్రాన్స్‌పర్ చేసుకునేందుకు పూర్తి అనుమతి ఇచ్చినట్లవుతుందని పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం
ఖాతాలో గుర్తు తెలియని నంబర్ల ద్వారా చిన్న మొత్తాల్లో డబ్బు జమ అవుతుందంటే అనుమానించాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. తెలియని నంబర్ల నుంచి వచ్చిన మేసేజ్‌లను, లింక్‌లను ఓపెన్ చేయకుండా నేరుగా డెలిట్ చేయాలని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment