
న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) తాజాగా బ్రిటన్‌లోనూ అందుబాటులోకి రానుంది. ఇందుకోసం యూపీఐని నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్‌లో భాగమైన ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ (ఎన్‌ఐపీఎల్) చెల్లింపు సేవల సంస్థ పేఎక్స్‌పర్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
దీని ప్రకారం బ్రిటన్‌లో పేఎక్స్‌పర్ట్‌కి చెందిన ఆండ్రాయిడ్ పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) పరికరాలు ఉండే స్టోర్స్‌లో యూపీఐ ఆధారిత క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. బ్రిటన్‌కు వెళ్లే భారతీయ ప్రయాణికులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని, ఎన్‌ఐపీఎల్ తెలిపింది. యూపీఐ విధానం ఇప్పటికే భూటాన్, నేపాల్‌లో కూడా అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment