ఎయిర్‌టెల్ బ్యాంకులో ఖాతా తెరవడం ఎలా..?
ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన మొట్టమొదటి ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకును గత వారం రాజస్థాన్‌లో ప్రారంభించింది. ప్రస్తుతం పదివేల ఎయిర్‌టెల్ అవుట్‌లెట్‌లలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. త్వరలో మరిన్ని రాష్ట్రాల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ బ్యాంక్‌లో అకౌంట్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం..
ఠ ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. మీరు ఎయిర్‌టెల్ కస్టమర్ కానక్కరలేదు. మీ దగ్గర్లోని ఎయిర్‌టెల్ అవుట్‌లెట్‌లో ఆధార్ కార్డును సబ్‌మిట్ చేయాలి. సబ్‌మిట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే అకౌంట్ ఓపెన్ అవుతుంది. వెంటనే ఎయిర్‌టెల్ బ్యాంక్ మీకు ఏటీఎం, క్రెడిట్ కార్డును ఆఫర్ చేస్తుంది. వీటి ద్వారా నగదు డిపాజిట్ చేయడంతోపాటు విత్ డ్రా చేసుకోవచ్చు. 400 కి డయల్ చేయడం ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ప్రతి సేవింగ్ అకౌంట్‌పై రూ.లక్ష వరకు వ్యక్తిగత ప్రమాద బీమా ఉంటుంది .పొదుపు ఖాతాల డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.