ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ట్విటర్ బోర్డ్ మెంబర్‌గా చేరడం లేదని ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ట్విటర్ బోర్డ్ మెంబర్ అవ్వడం ఎలన్ మస్క్‌కు ఇష్టం లేదు. కానీ తమ సంస‍్థ ఎలన్ మస్క్ ఇచ్చే అమూల్యమైన సలహాలు తీసుకుంటుందని అన్నారు.
ఎలన్ ట్విటర్ బోర్డ్ మెంబర్‌గా జాయిన్ అవ్వడంపై బోర్డ్ సభ్యులం ఎలన్‌తో సమావేశం అయ్యాం. ఈ సమావేశంలో ఎలన్ తన నిర్ణయాన్ని వెల్లడించారు."ఎలన్ మస్క్ ట్విట్టర్ బోర్డ్ లో చేరకూడదని నిర్ణయించుకున్నారు. బోర్డు సభ్యుల మాదిరిగానే కంపెనీ షేర్‌హోల్డర్‌లందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎలన్‌కు బోర్డ్ మెంబర్‌గా అవకాశం ఇచ్చినట్లు”అని అగర్వాల్ పేర్కొన్నారు.
Elon has decided not to join our board. I sent a brief note to the company, sharing with you all here. pic.twitter.com/lfrXACavvk
— Parag Agrawal (@paraga) April 11, 2022
అందుకే బోర్డ్ మెంబర్‌గా ఎలన్ మస్క్ నియామకం గత శనివారం (9వ తేదీ)న అధికారికంగా అమల్లోకి వచ్చింది. కానీ అదే రోజు ఎలన్ మస్క్ ట్విటర్ బోర్డ్ మెంబర్‌గా జాయిన్ అవ్వడం ఇష్టం లేదనే నిర్ణయాన్ని తెలిపినట్లు గుర్తు చేశారు. తాజాగా ఇదే విషయాన్ని పరాగ్ అగర్వాల్ ట్వీట్‌లో తెలిపారు. ట్విటర్‌లో 9 శాతం అత్యధిక వాటాను కలిగి ఉన్న ఎలన్ మస్క్ ఇన్‌పుట్స్‌ను సంస్థ స్వీకరింస్తుందని, కంపెనీ భవిష్యత్ కోసం ఈ బిజినెస్ టైకూన్ నిర్ణయాలను గౌరవిస్తుందంటూ ట్విటర్ సీఈఓ పరాగా అగర్వాల్ అధికారికంగా ట్వీట్‌లో స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment