ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఇచ్చిన భారీ ఆఫర్‌తో ట్విటర్ బోర్డు, ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉన్నట్టుండి ఏక మొత్తంగా ట్విటర్‌ను కొనేస్తానంటూ ప్రకటించడంతో పాటు ట్విటర్ ఫ్రీ స్పీచ్ పాలసీపై సంచలన కామెంట్లు చేశారు ఎలన్ మస్క్. దీంతో మస్క్ చేసిన భారీ ఆఫర్, ఎక్కు పెట్టిన భారీ విమర్శలపై ఎలా స్పందించాలనే అంశంపై ట్విటర్ బోర్డు సభ్యులతో పాటు ఉద్యోగులు మల్లగుల్లాలు పడుతున్నారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం ఎలన్‌మస్క్ ఆఫర్ గురించి ఒక్కసారిగా మీడియాలో వెల్లువలా వచ్చాయి. దీంతో ట్విటర్ బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించింది. అనంతరం ట్విటర్ సీఈవో పరాగ్ ఆగ్రావాల్ ఆ సంస్థ ఉద్యోగులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. మన బోర్డు మొత్తాన్ని బిలియనీర్లతోని నింపేస్తారా , ట్విటర్‌ను ఎలన్‌మస్క్‌కి ఇచ్చేస్తారా అంటూ కొందరు ప్రశ్నించగా.. సంస్థ ఉద్యోగులుగా మనం ఏం చేయగలమో దానిపై ఫోకస్ పెట్టడం ఉత్తమం, షేర్ హోల్డర్ల ప్రయోజనాలు, ట్విటర్ భవిష్యత్తుకి ఏది మంచిదని బోర్డు భావిస్తే ఆ నిర్ణయం తీసుకుంది అంతకు మించి చెప్పలేనంటూ పరాగ్ జవాబు ఇచ్చారు.
మరికొందరు ఎంప్లాయిస్ ఎలన్ మస్క్ చెప్పిన ప్రీ ఆఫ్ స్పీచ్‌ని ఎలా అర్థం చేసుకోవాలంటూ ప్రశ్నించగా.. ట్విటర్ నిత్యం ఆరోగ్యకరమైన సంభాషణలనే ప్రోత్సహిస్తుంటూ నర్మగర్భవ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అనేక మంది కోసం ట్విటర్ ఉంది తప్పితే ఏ ఒక్కరి కోసమే లేదని, మనపై వచ్చే విమర్శలను పరిశీలిస్తూ మరింత మెగుగయ్యేందుకు ప్రయత్నించాలంటూ ఉద్యోగులకు పరాగ్ సూచించారు. అయితే అంతర్గత సమావేశం, క్యూ అండ్ ఏలో చర్చించిన అంశాలపై ట్విటర్ అధికారికంగా స్పందించలేదు.
చదవండి: Elon Musk: ఏకంగా ట్విటర్‌నే దక్కించుకోవాలని ప్లాన్, కానీ..
Comments
Please login to add a commentAdd a comment