ఎలన్‌మస్క్ ట్విటర్‌ను సొంతం చేసుకుని ప్రైవేట్ కంపెనీగా మార్చడం పట్ల ఆ సంస్థకు చెందిన ఇన్వెస్టర్లు హ్యాపీగా ఉండగా అందులో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ట్విటర్ సీఈవో పరాగ్ అగ్రావాల్ బయటకు వెళ్లక తప్పందంటూ వార్తలు గుప్పుమంటుండగా ఈ జాబితాలో మరో భారత సంతతి ఉన్నత ఉద్యోగి కూడా చేరారు.
ట్విటర్‌కి పరాగ్ అగ్రావాల్ సీఈవోగా ఉండగా పాలసీ మేకర్‌గా, న్యాయ సలహాదారుగా విజయ గద్దె ఉన్నారు. ట్విటర్‌లో పోస్టింగుల సెన్సార్‌షిప్‌పై ఆమె పని చేస్తున్నారు. ద్వేషపూరిత ట్వీట్స్ చేసినందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ట్విటర్ నిషేధం విధించడంలో విజయది ప్రముఖ పాత్ర. మరోవైపు ట్వీట్స్‌పై సెన్సార్‌షిప్ పెట్టడాన్ని ఎలన్‌మస్క్ ఎప్పటి నుంచో విభేదిస్తూ వస్తున్నారు.
తాజాగా ట్విటర్‌ను ఎలన్‌మస్క్ సొంతం చేసుకోవడంపై ఆ సంస్థలో జరిగిన ఉద్యోగుల సమావేశంలో విజయ గద్దె తీవ్రంగా స్పందించారు. ట్విటర్ ఉద్యోగుల భవితవ్యం, కంపెనీ పాలసీ ఏ మలుపు తీసుకుంటాయో అంటూ ఆమె తీవ్రంగా కలత చెందినట్టు ఆ సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులు చెబుతున్నారు.
తాజాగా జరిగిన యాజామన్య మార్పుతో ఎలన్‌మస్క్ కచ్చితంగా పాలసీ మేకింగ్ విభాగంలో కీలకంగా వ్యవహరిస్తున్న విజయ గద్దెకు ఉద్వాసన పలుకుతారనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. గతంలో సెన్సార్‌షిప్ విషయంలో విజయగద్దె, ఎలన్‌మస్క్‌ల మధ్య చోటు చేసుకున్న వాదనలను వారు ఉదాహారణలతో సహా బయట పెడుతున్నారు.
Vijaya Gadde, the top censorship advocate at Twitter who famously gaslit the world on Joe Rogan's podcast and censored the Hunter Biden laptop story, is very upset about the @elonmusk takeover pic.twitter.com/WCYmzNEMNt
— Saagar Enjeti (@esaagar) April 26, 2022
దుందూకుడు చర్యలకు, సంప్రదాయేతర ఎత్తుడగలకు పెట్టింది పేరైన ఎలన్‌మస్క్ కచ్చితంగా ట్విటర్ స్వరూప స్వభావాల్లో భారీ మార్పులు చేపడతారని.. ఈ క్రమంలో పరాగ్ అగ్రావాల్‌తో పాటు విజయ గద్దెలను అటు ఇటుగా బయటకు సాగనంపుతారనే ప్రచారం ఊపందుకుంది.
చదవండి: ఎలన్ మస్క్ చేతిలోకి ట్విటర్...ఇన్వెస్టర్లు హ్యాపీ.. ఉద్యోగులు వర్రీ
Comments
Please login to add a commentAdd a comment