
Twitter Chief Parag Agrawal Restructures Top Leadership Team: మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విటర్ కొత్త సీఈవోగా పరాగ్ అగర్వాల్ బాధ్యతలను చేపట్టిన విషయం తెలిసిందే. కంపెనీలో తనదైన ముద్రను చూపించేందుకు పరాగ్ అడుగులు వేస్తున్నారు. ట్విటర్ పునర్నిర్మాణంపై పరాగ్ అగర్వాల్ దృష్టిసారించారు.
ట్విటర్‌లో రీస్ట్రక్చరింగ్..!
ట్విటర్‌లో తనదైన ముద్రను వేస్తూ...కంపెనీ పునర్నిర్మాణంపై పరాగ్ అగర్వాల్ ఫోకస్ చేశారు. ట్విటర్‌లో వివిధ హోదాలు, స్థాయిల్లో నెలకొన్న లోపాలను సవరించడంలో భాగంగా కంపెనీలో ప్రక్షాళన పనులను పరాగ్ చేపట్టారు. ట్విటర్‌లో పరాగ్ తీసుకుంటున్న చర్యలపై అమెరికన్ పత్రిక ‘ది వాషింగ్టన్ పోస్ట్’ ఓ కథనాన్ని ప్రచురించింది.ట్విటర్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా కంపెనీలోని ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్‌పై వేటు పడినట్లు తెలుస్తోంది. 2019లో ట్విటర్‌లో చేరి ఇంటర్నల్ ఈ-మెయిల్, కంపెనీ చీఫ్ డిజైనింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన డాంట్లే డేవిస్ తన పదవికి రాజీనామా చేశారు. పరాగ్ అగర్వాల్‌కు సమకాలీకుడైన ట్విటర్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ అధినేత మైఖెల్ మొంటానో కూడా తన పదవి నుంచి తప్పుకొనున్నట్లు తెలుస్తోంది. వీరు ఇరువురు ట్విటర్‌కు గుడ్‌బై చెప్పినట్లు ‘ది వాషింగ్టన్ పోస్ట్’ ఒక కథనంలో పేర్కొంది. ఈ నెల చివరి వరకూ వీరు కొనసాగనున్నారు.
బదిలీల పర్వం..!
పరాగ్ రాకతో కంపెనీలో పలు కీలక పోస్ట్‌ల బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది. ట్విటర్ మాజీ హెడ్ ఆఫ్ ప్రొడక్ట్ కేవాన్ బేక్‌పౌర్‌ను కన్స్యూమర్ డిపార్ట్‌మెంట్ జనరల్ మేనేజర్‌గా నియమించారు. నిక్ కాల్డ్‌వెల్‌ను కోర్ టెక్ జనరల్ మేనేజర్‌గా బదిలీ చేశారు. స్ట్రాటజీ, ఆపరేషన్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ లిండ్సేకు ప్రమోషన్ దొరికింది. ఆమెను పూర్తిస్థాయి ఉపాధ్యక్షురాలిగా నియమించారు.
ఆపరేషన్ ఎక్సలెన్సీపైనే ప్రధాన దృష్టి..!
ది వాసింగ్టన్ పోస్ట్ ప్రచురణ ప్రకారం...ఆపరేషనల్ ఎక్సలెన్సీపై పరాగ్ అగ్రవాల్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిపింది. భారత్ లాంటి దేశాల్లో ట్విటర్‌పై కేంద్రం విరుచుకుపడుతూనే ఉంది. కొద్ది రోజులపాటు, ట్విటర్‌కు, కేంద్రానికి యుద్దవాతావరణమే నెలకొంది. భారతే కాకుండా ఇతర దేశాల్లో కూడా ట్విటర్ పలు ప్రతికూలతలను ఎదుర్కొంటుంది. నకిలీ వార్తలను అడ్డుకోవడంలో ట్విటర్ పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి.
చదవండి: మిలీనియల్స్‌కు ఏ కార్లంటే ఇష్టం, ఈ మిలీనియల్స్ అంటే ఎవరు?