ట్విటర్ సీఈవోగా ఒక భారతీయుడు ఎంపిక కావడంపై మన దేశంలోనే కాదు.. మేధావి వర్గం నుంచీ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో ఉన్నపళంగా జాక్ డోర్సే తప్పుకోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో స్వతహాగా ఇలాంటి అంశాల్లో తల దూర్చే ఎలన్ మస్క్.. ఓ ట్వీట్ చేసి కాక రేపాడు.
టెస్లా సీఈవో ఎలన్ మస్క్ తాజాగా ఓ ఫొటో ట్వీట్ చేశాడు. అది ఒక హిస్టారికల్ అండ్ కాంట్రవర్షియల్ ఫొటో. పై ఫ్రేమ్‌లో యూఎస్‌ఎస్‌ఆర్ నియంత జోసెఫ్ స్టాలిన్, స్టాలిన్ అంతరంగికుడు నికోలాయ్ యెజోవ్.. పక్కపక్కనే ఉంటారు. కానీ, కింద ఫ్రేమ్‌లో స్టాలిన్ ఫొటో మాత్రమే ఉంటుంది. అందుకు కారణం ఉంది. తొలినాళ్లలో స్నేహితులుగా ఉన్న నికోలాయ్-స్టాలిన్ మధ్య.. రాజకీయ పరిణామాలతో వైరం మొదలవుతుంది. ఈ తరుణంలో స్టాలిన్ ఆదేశాల మేరకే నికోలాయ్ హత్య కూడా జరిగిందని చెప్తారు.
ఈ కారణంతోనే వీళ్లిద్దరూ సరదాగా గడిపిన ఫొటో తర్వాతి రోజుల్లో రష్యాలో సెన్సార్‌షిప్‌కు గురైంది. అలా స్టాలిన్ పక్క నుంచి నికోలాయ్ యెజోవ్ ఫొటోను తొలగించారు. అయితే ఈ సీరియస్ అంశాన్ని.. తర్వాతి రోజుల్లో సరదా కోణంలో వాడేసుకుంటున్నారు కొందరు. ఇక మస్క్ దానిని మరీ మించి వాడేశాడు.
స్టాలిన్ బాడీకి ట్విటర్ కొత్త సీఈవో పరాగ్ అగర్వాల్ తలను, నికోలాయ్ బాడీకి ట్విటర్ మాజీ సీఈవో డోర్సే తలను అంటించాడు. పైగా రెండో టెంప్లేట్‌లో డోర్సే పక్కనే ఉన్న కాలువలోకి విసిరివేయబడ్డట్లు ఫన్నీ కోణంలో ఉంది. దీంతో నెటిజనులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మస్క్‌ను తిట్టిపోస్తున్నారు. అదే టైంలో మస్క్‌కు తగ్గట్లుగానే కౌంటర్ మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు.
— Elon Musk (@elonmusk) December 1, 2021
ఇదిలా ఉంటే ఎలన్ మస్క్‌కు, జాక్ డోర్సేకు మాంచి స్నేహం ఉంది. ఇద్దరూ క్రిప్టోకరెన్సీని ప్రమోట్ చేయడమే కాదు.. గంజాయి ప్రియులు కూడా అంటూ గతంలో బోలెడు కథనాలు వెలువడ్డాయి. అంతేకాదు కిందటి ఏడాది జాక్ ట్విటర్ సీఈవో పదవికి గండం ఏర్పడినప్పుడు.. జాక్‌కి మద్దతుగా నిలిచాడు కూడా.
Just want say that I support @Jack as Twitter CEO. He has a good ❤️.
— Elon Musk (@elonmusk) March 3, 2020
— Patel Meet (@mn_google) December 1, 2021
— evolve (@evolvedzn) December 1, 2021
— evolve (@evolvedzn) December 1, 2021
ఇదీ చదవండి: పరాగ్ ఎంపికపై ఎలన్ మస్క్ ఏమన్నాడంటే..
Comments
Please login to add a commentAdd a comment