controversial photo
-
Elon Musk: పరాగ్‌పై వివాదాస్పద ట్వీట్.. రచ్చ
ట్విటర్ సీఈవోగా ఒక భారతీయుడు ఎంపిక కావడంపై మన దేశంలోనే కాదు.. మేధావి వర్గం నుంచీ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో ఉన్నపళంగా జాక్ డోర్సే తప్పుకోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో స్వతహాగా ఇలాంటి అంశాల్లో తల దూర్చే ఎలన్ మస్క్.. ఓ ట్వీట్ చేసి కాక రేపాడు. టెస్లా సీఈవో ఎలన్ మస్క్ తాజాగా ఓ ఫొటో ట్వీట్ చేశాడు. అది ఒక హిస్టారికల్ అండ్ కాంట్రవర్షియల్ ఫొటో. పై ఫ్రేమ్‌లో యూఎస్ఎస్ఆర్ నియంత జోసెఫ్ స్టాలిన్, స్టాలిన్ అంతరంగికుడు నికోలాయ్ యెజోవ్.. పక్కపక్కనే ఉంటారు. కానీ, కింద ఫ్రేమ్‌లో స్టాలిన్ ఫొటో మాత్రమే ఉంటుంది. అందుకు కారణం ఉంది. తొలినాళ్లలో స్నేహితులుగా ఉన్న నికోలాయ్-స్టాలిన్ మధ్య.. రాజకీయ పరిణామాలతో వైరం మొదలవుతుంది. ఈ తరుణంలో స్టాలిన్ ఆదేశాల మేరకే నికోలాయ్ హత్య కూడా జరిగిందని చెప్తారు. ఈ కారణంతోనే వీళ్లిద్దరూ సరదాగా గడిపిన ఫొటో తర్వాతి రోజుల్లో రష్యాలో సెన్సార్‌షిప్‌కు గురైంది. అలా స్టాలిన్ పక్క నుంచి నికోలాయ్ యెజోవ్ ఫొటోను తొలగించారు. అయితే ఈ సీరియస్ అంశాన్ని.. తర్వాతి రోజుల్లో సరదా కోణంలో వాడేసుకుంటున్నారు కొందరు. ఇక మస్క్ దానిని మరీ మించి వాడేశాడు. స్టాలిన్ బాడీకి ట్విటర్ కొత్త సీఈవో పరాగ్ అగర్వాల్ తలను, నికోలాయ్ బాడీకి ట్విటర్ మాజీ సీఈవో డోర్సే తలను అంటించాడు. పైగా రెండో టెంప్లేట్లో డోర్సే పక్కనే ఉన్న కాలువలోకి విసిరివేయబడ్డట్లు ఫన్నీ కోణంలో ఉంది. దీంతో నెటిజనులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మస్క్‌ను తిట్టిపోస్తున్నారు. అదే టైంలో మస్క్‌కు తగ్గట్లుగానే కౌంటర్ మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు. pic.twitter.com/OL2hnKngTx — Elon Musk (@elonmusk) December 1, 2021 ఇదిలా ఉంటే ఎలన్ మస్క్‌కు, జాక్ డోర్సేకు మాంచి స్నేహం ఉంది. ఇద్దరూ క్రిప్టోకరెన్సీని ప్రమోట్ చేయడమే కాదు.. గంజాయి ప్రియులు కూడా అంటూ గతంలో బోలెడు కథనాలు వెలువడ్డాయి. అంతేకాదు కిందటి ఏడాది జాక్ ట్విటర్ సీఈవో పదవికి గండం ఏర్పడినప్పుడు.. జాక్కి మద్దతుగా నిలిచాడు కూడా. Just want say that I support @Jack as Twitter CEO. He has a good ❤️. — Elon Musk (@elonmusk) March 3, 2020 pic.twitter.com/IYAQasGJg3 — Patel Meet (@mn_google) December 1, 2021 pic.twitter.com/tUqINMQl8s — evolve (@evolvedzn) December 1, 2021 pic.twitter.com/tUqINMQl8s — evolve (@evolvedzn) December 1, 2021 ఇదీ చదవండి: పరాగ్ ఎంపికపై ఎలన్ మస్క్ ఏమన్నాడంటే.. -
దుమారం రేపిన ఫొటో
న్యూఢిల్లీ: బీజేపీ నాయకురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోపై దుమారం రేగింది. పశ్చిమ బెంగాల్లో హిందువుల పట్ల తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా హర్యానా బీజేపీ నాయకురాలు విజేత మాలిక్ తన ఫేజ్‌బుక్ పేజీలో ఫొటో వివాదానికి కారణమైంది. భోజ్‌పురి సినిమా ‘ఔరత్ ఖిలోనా నహీ’లోని ఒక ఫోటోను ఫేస్బుక్లో షేర్ చేశారు. అందరూ చూస్తుండగా నడిరోడ్డులో ఒక రాజకీయ నాయకుడు మహిళ చీర లాగుతున్న ఫొటో పోస్ట్ చేసి.. బెంగాల్లో హిందువుల పరిస్థితి దారుణంగా ఉందని కామెంట్ పెట్టారు. హిందువులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఫొటోలో చూపినట్టుగా హిందువులను బహిరంగంగా వేధిస్తున్నారని పేర్కొన్నారు. బెంగాల్ ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను ఎందుకు వెనక్కు ఇచ్చేయడం లేదని ప్రశ్నించారు. హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల మమతా బెనర్జీ సర్కారు ఉదాసీన వైఖరి చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులను చిన్నచూపు చూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. అభ్యంతకర ఫొటో పోస్ట్ చేసిన విజేత మాలిక్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమె పెట్టిన ఫొటో మహిళలను కించేపరిచేలా ఉందని పేర్కొన్నారు. హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్న మాలిక్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై బీజేపీ స్పందించలేదు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి నటించిన సినిమాలోని ఫొటోనే మాలిక్ పోస్ట్ చేయడం కొసమెరుపు. -
హాఫ్ ఫొటో చూసి నిందలు వేస్తారా?
తన తల్లిపై అనవసరంగా నిందలు వేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కుమార్తె తేజశ్విని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. తన తల్లిపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై తేజుశ్విని స్పందించారు. కుటుంబ సభ్యులతో కలిసి రెస్టరెంట్ కు వెళ్లిన రేణుక ఫొటోపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. పనమ్మాయిని పక్కనే నిలబెట్టి వారంతా భోజనం చేస్తున్నట్టు ఆ ఫొటోలో ఉంది. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పనమ్మాయిని మనిషిగా చూడకుండా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకోకుండా నిందలు వేయడం సరికాదని తేజుశ్విని అన్నారు. 'పనమ్మాయిని నాకోసమే నియమించింది. ఆమె బాలిక కాదు. ఆమె వయసు 26 ఏళ్లు. ఆమెకు 9, 7 ఏళ్ల వయసున్న పిల్లలు ఉన్నారు. రెస్టరెంట్ లో మాతోపాటే భోజనం చేసింది. మా అమ్మ అందరినీ సమానంగా చూస్తుంది. తన చుట్టు ఉన్నవారి అవసరాలను స్వయంగా తెలుసుకుని తీరుస్తుంది. ఎంతో మంది మహిళలు, పిల్లలను ఆమె కాపాడింది. ధైర్యం, విశ్వాసం, దయగుణం కలిగిన అమ్మ ఇప్పటికీ ప్రజల కోసం ఎంతో కష్టపడి పనిస్తోంది. అలాంటి ఆమె అకారణంగా నిందలు మోపుతున్నారు. ఆమె సహాయం పొందిన వారిలో చాలా మందికి ట్విటర్ ఖాతాలు లేవు. అందుకే సోషల్ మీడియాలో విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నారు. సరైన ఆధారాలు లేకుండా నిందారోపణలు చేయడం సమంజసం కాదు. హాఫ్ ఫొటో చూసి విమర్శలు గుప్పించడం కరెక్ట్ కాదు. అసలేం జరిగిందో తెలియకుండా ఎదుటివారిని బాధ పెట్టే కామెంట్స్ చేయొద్ద'ని తేజుశ్విని పేర్కొన్నారు.