![NGT Slaps Huge Fine On Telangana Government - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/22/NGT-Slaps-Huge-Fine-On-Tela.jpg.webp?itok=4AvObMq4)
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌జీటీ భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టారని రూ.900 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. మూడు నెలల్లో చెల్లించాలని చెన్నై ఎన్‌జీటీ ధర్మాసనం ఆదేశించింది. మొత్తం ప్రాజెక్టులకు అయ్యే ఖర్చులో 1.5 శాతం జరిమానా విధించింది. జరిమానాను కేఆర్‌ఎంబీ వద్ద జమ చేయాలని ఎన్‌జీటీ పేర్కొంది.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన తెలిసిందే.
చదవండి: కరోనా కొత్త వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్
Comments
Please login to add a commentAdd a comment