సాక్షి, ఢిల్లీ/భద్రాద్రి: తెలంగాణ సర్కార్‌కు ఎన్‌జీటీ నుంచి మరో ఝలక్ తగిలింది. ప్రతిష్టాత్మకంగా నిర్మించతలబెట్టిన సీతమ్మ సాగర్ బ్యారేజ్ ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బ్రేకులు వేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టు పనుల్ని వెంటనే నిలిపివేయాలని, అనుమతులు తీసుకోవాల్సిందేనంటూ ఎన్‌జీటీ చెన్నై బెంచ్ తీర్పు ఇచ్చింది ట్రిబ్యునల్.
గోదావరి నీటి నిల్వతో పాటు జల విద్యుదుత్పత్తికి ఉపయోగపడేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద కేసీఆర్ సర్కార్.. ఈ ప్రాజెక్టును నిర్మించ తలపెట్టింటి. దుమ్ముగూడెం ఆనకట్టకు ఎగువన భద్రాచలం సీతమ్మ వారి పర్ణశాలకు దగ్గరగా బ్యారేజీ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో.. సీతమ్మ సాగర్‌గా నామకరణం చేసింది. 37 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా బ్యారేజీ, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా ప్లాంటు నిర్మించాలని ప్రభుత్వం భావించింది.
అయితే.. ఒకవైపు బ్యారేజీ నిర్మాణ పనులు నెమ్మదిగా కొనసాగుతుండగా.. పర్యావరణ అనుమతులు వచ్చాకే ప్రాజెక్టు పనులు కొనసాగించాలని ఇప్పుడు ఎన్జీటీ ఆదేశించడం గమనార్హం. ఈ మేరకు తదుపరి విచారణను ఏప్రిల్ 26వ తేదీకి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: మా మెట్రో ఏం పాపం చేసింది?
Comments
Please login to add a commentAdd a comment