
సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్‌జీటీ) కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. నేడు ఎన్‌జీటీలో ప్రాజెక్టు అంశం విచారణకొచ్చింది. జస్టిస్ జావెద్ బెంచ్‌కు కేసును బదిలీ చేయాలని పిటిషనర్ తరఫు లాయర్ విజ్ఞప్తి చేయగా.. అందుకు తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. తాగునీటి అవసరాలకు సంబంధించిన పనులే చేస్తున్నామని చెప్పారు. ఎన్‌జీటీ నుంచి అనుమతులు వచ్చాకే మిగతా పనులు చేపట్టనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. మరోవైపు కేసు విచారణను వేగవంతం చేయాలని పిటిషనర్ కోరారు. ఈ క్రమంలో కేసు మరోసారి వాయిదా వేశారు.