విమానంలో జోక్.. రూ. 54 లక్షల ఫైన్ | Venezuelan fined 89,000 dollars for joke about bomb on plane | Sakshi
Sakshi News home page

విమానంలో జోక్.. రూ. 54 లక్షల ఫైన్

Published Wed, Dec 3 2014 11:56 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

విమానంలో జోక్.. రూ. 54 లక్షల ఫైన్

విమానంలో జోక్.. రూ. 54 లక్షల ఫైన్

మియామి: విమానంలో పరిహాసమాడినందుకు ఓ ప్రయాణికుడికి అమెరికా కోర్టు భారీ జరిమానా విధించింది. జోక్ చేసి విమాన రాకపోకలకు అంతరాయం కలిగించినందుకు వెనిజులా వైద్యుడు మాన్యుల్ అల్బర్టో ఆల్వారాడో(60) అనే వ్యక్తికి మియామి కోర్టు 89,000 డాలర్ల (సుమారు రూ.5429000) జరిమానా వేసింది.

గత అక్టోబర్ లో మియామి అంతర్జాతీయ ఎయిర్పోర్టులో విమానం ఎక్కిన తర్వాత ఆల్వారాడో తన లగేజీలో పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ పరిహాసమాడాడు. ఇది నిజమని నమ్మిన అధికారులు సెక్యురిటీ అలర్ట్ జారీ చేశారు. ఫలితంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. పరిహాసమాడాడని తర్వాత అతడు వెల్లడించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ముందు అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. చేసిన పనికి సిగ్గుపడుతూ క్షమాపణ చెప్పడంతో చివరకు జరిమానాతో సరిపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement