creditcards
-
హోం లోన్లపై వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు, ఇళ్లకు డిమాండ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగల కాలంలో (దీపావళి వరకు కొనసాగే సీజన్) ఇళ్లకు డిమాండ్ బలంగా ఉంటుందని రియల్ ఎస్టేట్ డెవలపర్లు, కన్సల్టెంట్లు అంచనా వేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ అన్ని రకాల గృహ రుణాలను 6.7 శాతానికే ఇస్తున్నట్టు ప్రకటించడం, పలు ఇతర బ్యాంకులు సైతం గృహ రేట్లను గణనీయంగా తగ్గించడం డిమాండ్‌కు ఊతమిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కోటక్ బ్యాంకు సైతం గృహ రుణ రేట్లను గణనీయంగా తగ్గించగా.. మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు కూడా ఇదే విధమైన నిర్ణయాలు ప్రకటించొచ్చని రియల్ ఎస్టేట్ పరిశ్రమ అంచనా వేస్తోంది. చదవండి : లోన్ తీసుకునేవారికి బ్యాంకులు బంపర్ ఆఫర్స్ సానుకూల నిర్ణయం.. రుణం ఎంతనే దానితో సంబంధం లేకుండా క్రెడిట్ స్కోరు ఆధారితంగా గృహ రుణాలను 6.70 శాతం నుంచి ఆఫర్ చేస్తున్నట్టు ఎస్బీఐ గురువారం ప్రకటించడం గమనార్హం. అంతకుముందు వరకు రూ.75 లక్షల వరకు రుణాలపై 7.15 శాతం వడ్డీ రేటు అమల్లో ఉండేది. దీనిపై అనరాక్ గ్రూపు చైర్మన్ అనుజ్‌పురి స్పందిస్తూ.. ‘‘ఎస్బీఐ నిర్ణయం నిజంగా పోటీనిస్తుంది. ఈ కొత్త రేటు ప్రజాస్వామ్యయుతంగా ఉంది. ఏ బడ్జెట్లో కొనుగోలు చేసే వారైనా ప్రయోజనం పొందొచ్చు’’ అని చెప్పారు. ఎస్బీఐ సరైన సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ సీజన్లో గృహ నిర్మాణ రంగం మంచిగా పుంజుకుంటుందన్నారు. ప్రాసెసింగ్ ఫీజుల మాఫీ కూడా సానుకూల నిర్ణయంగా పేర్కొన్నారు. హౌసింగ్ డాట్ కామ్, మకాన్, ప్రాప్‌టైగర్ పోర్టళ్ల గ్రూపు సీఈవో వికాస్ వాధ్వాన్ సైతం ఇదే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇప్పటికే డిమాండ్ ఊపందుకున్న గృహ నిర్మాణ రంగానికి మరింత ప్రోత్సాహాన్నిస్తుందన్నారు. ధరలు స్తబ్ధుగా ఉన్నందున కొనుగోలుదారులకు కొంత ఆదా కూడా అవుతుందన్నారు.ప్రముఖ బ్యాంకులు రుణ రేట్లను తగ్గించడం ప్రేరణనిస్తుందని సోతెబీ ఇంటర్నేషనల్ రియాలిటీ సీఈవో అమిత్ గోయల్ అన్నారు. చదవండి: లోన్ ఇవ్వనందుకు ఎస్బీఐకి మొట్టికాయ -
ఆర్బీఎల్ వీసా క్రెడిట్ కార్డుల జారీ ప్రారంభం
ముంబై: వీసా పేమెంట్ నెట్వర్క్ ఆధారిత కార్డుల జారీని ఆర్బీఎల్ బ్యాంకు ప్రారంభించింది. కార్డు డేటాను భారత్‌లోనే నిల్వ చేయాలన్న నిబంధనలను మాస్టర్‌కార్డు ఆచరణలో పెట్టకపోవడంతో కొత్త కార్డుల జారీపై జూలై 14న ఆర్బీఐ నిషేధం విధించింది. అప్పటి వరకు ఆర్బీఎల్ బ్యాంకు మాస్టర్కార్డులనే జారీ చేస్తుండేది. ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో వీసా పేమెంట్ నెట్‌వర్క్‌తో జూలై 14నే ఆర్బీఎల్ బ్యాంకు ఒప్పందం చేసుకుంది. డేటా అనుసంధానాన్ని వేగంగా పూర్తి చేసుకోవడంతో వీసా కార్డుల జారీని మొదలు పెట్టినట్టు బ్యాంకు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12–14 లక్షల కార్డుల జారీ లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రకటించింది. క్రెడిట్ కార్డుల్లో ఆర్బీఎల్ బ్యాంకుకు 5 శాతం మార్కెట్ వాటా ఉంది. -
ఇక పోర్న్ చూడాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి!
లండన్: ఇక అశ్లీల చిత్రాలు చూడాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయనున్నారు. అశ్లీల చిత్రాలు యువతపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న నేపథ్యంలో ఆ సమస్యను ఎదుర్కొనేందుకు బ్రిటన్ ఈమేరకు గట్టి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇది వరకే పెట్టుకున్న నిబంధనలు ఇక కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. గతంలో పెట్టిన నిబంధనలు అతిక్రమించి పోర్న్ సైట్లు చూసేలా సదరు సైట్లు అవకాశం కల్పించడంతో చిన్నపిల్లలు సైతం వాటిని వీక్షిస్తున్నారని.. ఆ ప్రభావం వారి పెరుగుదలపై పడుతున్న నేపథ్యంలో ఇక నుంచి పోర్న్ సైట్ చూసే వారు తమ వయసు నిర్ధారణ పకడ్బందీగా చేసుకున్నాకే వాటిని చూసే అవకాశం కల్పించాలని భావిస్తుంది. వీటిని చూడాలనుకునే వారు తమ క్రెడిట్ కార్డును ఉపయోగించి దాని ద్వారా తమ వయస్సు నిర్దారణ చేసుకోవాలనే నిబంధన తీసుకురానుంది. ఈ నిబంధన ప్రతి పోర్న్ సైట్ పాటించాలని లాగిన్ అయ్యే వారికి వయస్సు నిర్ధారణ ప్రశ్నలో భాగంగా క్రెడిట్ కార్డు డిటెయిల్స్ కోరాలని దాని ద్వారా మాత్రమే వయో నిర్థారణ చేసుకొని వాటిని చూసే ఏర్పాట్లు చేసుకోవాలనే నిబంధనను ఇక అమల్లోకి తీసుకురానున్నారు. గతంలో తాము విధించిన నిబంధనలు పోర్న్ సైట్లే పాటించకపోవడంతో దానిని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బ్రిటన్ రాణి డిజిటల్ ఎకానమీ అంశంపై ఇచ్చిన ప్రసంగంలో భాగంగా ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ఇక క్రెడిట్ కార్డులతో మాత్రమే యూజర్లు సైన్ చేసుకొని వయస్సు నిర్థారణ అయిన తర్వాతే పోర్న్ వీడియోలు చూసే అవకాశం ఉంటుంది.