
డెబిట్, క్రెడిట్ కార్డుల దుర్వినియోగం, సైబర్ నేరాలపై ఫిర్యాదులు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వీటికి చెక్ పెట్టేందుకు శ్రీకారం చుట్టింది. అందుకోసం ఆర్బీఐ నూతనంగా కార్డ్-ఆన్-ఫైల్ టోకనైజేషన్ నిబందనలను అక్టోబర్ 1 నుంచి అమలు చేయనుంది. గతంలో కార్డుల వినియోగదారులు వారి భవిష్యత్ చెల్లింపుల కోసం వ్యక్తిగత సమాచారం..అంటే బ్యాంక్ నెంబర్లు, వారి పేర్లు, ఇతర వివరాల్ని వెబ్‌సైట్‌లో స్టోర్ చేసేవాళ్లు. దీని కారణంగా సైబర్ నేరాలకు పాల్పడే వారిపని ఈజీగా మారింది. వీటిని అరికట్టేందుకు నూతన టోకన్ పద్దతిని ప్రవేశపెట్టింది ఆర్బీఐ.
ఈ కొత్త నిబంధనల ప్రకారం..ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసేటప్పుడు 16 అంకెల కార్డు నంబర్, పేర్లు, గడుపు తేది వంటి సమాచారం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆయా బ్యాంకులు జారీ చేసే నంబర్‌తో ఇకపై లావాదేవీలు చేసుకోవచ్చు. కస్టమర్ల కార్డ్ వివరాలను సేఫ్‌గా ఉంచేందుకు ఆర్బీఐ ఈ టోకనైజేషన్ నిబంధనలను అమలు చేస్తోంది. దీని అమలు తర్వాత కస్టమర్ల డేటా మొత్తం వారి బ్యాంకు వద్ద మాత్రమే ఉంటుంది తప్ప ఇతర వెబ్‌సైట్‌లలో ఉండదు. ఈ సర్వీసును పొందేందుకు ఎటువంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు.
చదవండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు: కొనే ముందు ఇవి గుర్తుపెట్టుకోండి, లేదంటే బేబుకి చిల్లే!
Comments
Please login to add a commentAdd a comment