Tokenisation
-
క్రెడిట్,డెబిట్ కార్డులపై కీలక నిర్ణయం.. ఆర్బీఐ కొత్త రూల్!
డెబిట్, క్రెడిట్ కార్డుల దుర్వినియోగం, సైబర్ నేరాలపై ఫిర్యాదులు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వీటికి చెక్ పెట్టేందుకు శ్రీకారం చుట్టింది. అందుకోసం ఆర్బీఐ నూతనంగా కార్డ్-ఆన్-ఫైల్ టోకనైజేషన్ నిబందనలను అక్టోబర్ 1 నుంచి అమలు చేయనుంది. గతంలో కార్డుల వినియోగదారులు వారి భవిష్యత్ చెల్లింపుల కోసం వ్యక్తిగత సమాచారం..అంటే బ్యాంక్ నెంబర్లు, వారి పేర్లు, ఇతర వివరాల్ని వెబ్సైట్లో స్టోర్ చేసేవాళ్లు. దీని కారణంగా సైబర్ నేరాలకు పాల్పడే వారిపని ఈజీగా మారింది. వీటిని అరికట్టేందుకు నూతన టోకన్ పద్దతిని ప్రవేశపెట్టింది ఆర్బీఐ. ఈ కొత్త నిబంధనల ప్రకారం..ఆన్లైన్లో చెల్లింపులు చేసేటప్పుడు 16 అంకెల కార్డు నంబర్, పేర్లు, గడుపు తేది వంటి సమాచారం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆయా బ్యాంకులు జారీ చేసే నంబర్‌తో ఇకపై లావాదేవీలు చేసుకోవచ్చు. కస్టమర్ల కార్డ్ వివరాలను సేఫ్‌గా ఉంచేందుకు ఆర్బీఐ ఈ టోకనైజేషన్ నిబంధనలను అమలు చేస్తోంది. దీని అమలు తర్వాత కస్టమర్ల డేటా మొత్తం వారి బ్యాంకు వద్ద మాత్రమే ఉంటుంది తప్ప ఇతర వెబ్సైట్లలో ఉండదు. ఈ సర్వీసును పొందేందుకు ఎటువంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. చదవండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు: కొనే ముందు ఇవి గుర్తుపెట్టుకోండి, లేదంటే బేబుకి చిల్లే! -
కరోనా తర్వాత ఆన్లైన్ వైపే మొగ్గు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా వైరస్ తర్వాత పరిస్థితుల్లో క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్లైన్లో కొనుగోళ్లు జరిపే ధోరణి గణనీయంగా పెరిగిందని ఎస్బీఐ కార్డ్ ఎండీ, సీఈవో రామ్మోహన్ రావు అమర తెలిపారు. తమ క్రెడిట్ కార్డుదారుల లావాదేవీల్లో దాదాపు 55 శాతం పైగా ఇవే ఉంటున్నాయని ఆయన వివరించారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో కార్డుల వినియోగం, సగటున కార్డుపై చేసే వ్యయాలు భారీగా ఉంటోందని రామ్మోహన రావు తెలిపారు. సాధారణంగా జూన్ త్రైమాసికం కాస్తంత డల్‌గా ఉంటుందని, కానీ ఈసారి కార్డుల ద్వారా ఖర్చు చేసే ధోరణి గణనీయంగా పెరిగిందని చెప్పారు. రాబోయే పండుగ సీజన్లో కూడా ఇదే ధోరణి కనిపించవచ్చని ఆశిస్తున్నట్లు రామ్మోహన్ రావు తెలిపారు. కొత్తగా క్యాష్‌బ్యాక్ ఎస్బీఐ కార్డును ఆవిష్కరించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోకు ఆయన ఈ విషయాలు వివరించారు. మారుతున్న వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు చెప్పారు. కార్డుల వినియోగ ప్రయోజనాలను తర్వాత ఎప్పుడో అందుకోవడం కాకుండా తక్షణం లభించాలని వినియోగదారులు కోరుకుంటున్నారని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్డును ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. కేవలం ఒక విక్రేతకు మాత్రమే పరిమితం కాకుండా ఆన్లైన్లో చేసే కొనుగోళ్లన్నింటికీ సంబంధించి 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చని పేర్కొన్నారు. తదుపరి బిల్లింగ్ స్టేట్మెంట్లో ఇది ప్రతిఫలిస్తుందని వివరించారు. క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలకు నెలకు రూ. 10,000 మేర గరిష్ట పరిమితి ఉంటుందని రామ్మోహన్ రావు చెప్పారు. అటుపైన కూడా తగు స్థాయిలో ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ తరహా కార్డును ఆవిష్కరించడం దేశీయంగా ఇదే తొలిసారని చెప్పారు ప్రత్యేక ఆఫర్ కింద 2023 మార్చి వరకూ దీన్ని ఎటువంటి చార్జీలు లేకుండా పొందవచ్చు. టోకెనైజేషన్‌కు ఎస్బీఐ కార్డ్ రెడీ వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడం, ఏదైనా డేటా లీకేజీకి వ్యతిరేకంగా భరోసా ఇవ్వడం పరంగా టోకెనైజేషన్ విధానం మెరుగైనదని రామ మోహన్ రావు తెలిపారు. పెద్ద సంస్థలు ఇప్పటికే ఈ సాంకేతికతను అమలు చేస్తున్నాయని అక్టోబర్ నుండి ఈ విధానం ఎస్బీఐ కార్డ్ అమలు చేస్తుందని వెల్లడించారుకాగా, ఆన్లైన్ లేదా దుకాణాల్లో చెల్లింపుల సమయంలో కస్టమర్ తన కార్డు వివరాలు ఇవ్వవలసిన అవసరం ఉండదు. స్మార్ట్‌ఫోన్ సహకారంతో డిజిటల్ టోకెన్ రూపంలో లావాదేవీ పూర్తి చేయవచ్చు. ప్రతి లావాదేవీకి టోకెన్ మారుతుంది. ఇది పూర్తిగా సురక్షితం. సైబర్ మోసానికి, డేటా చోరీకి ఆస్కారం లేదు. -
ఎస్బీఐ ఖాతాదారులకు ముఖ్య గమనిక!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నెల నుంచి కొత్త డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు నిబంధనల్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. తద్వారా రోజురోజుకి పెరిగిపోతున్న సైబర్ మోసాలు, యూజర్ల వ్యక్తిగత వివరాల్ని దొంగిలించడం లాంటి ఘటనల్ని తగ్గించవచ్చని భావిస్తోంది. ఆర్బీఐ ఆదేశాల మేరకు..2020 మార్చి నెలలో ఎస్బీఐ తన కస్టమర్లకు, ఉద్యోగులు, స్టాక్ హోల్డర్లకు ప్రపంచ స్థాయిలో సర్వీసులు, లావాదేవీల కోసం ప్యూర్ ప్లే క్రెడిట్ కార్డ్‌ను వినియోగంలోకి తెచ్చింది. ఇప్పుడు ఆ కార్డులను టోకనైజేషన్ చేయనుంది. నిబంధనలకు లోబడి తయారీ, సంసిద్ధత, సాంకేతికత వారీగా,ఇంటిగ్రేషన్ కోసం ఫైనాన్షియల్ సర్వీస్ సంస్థలైన వీసా,మాస్టర్ కార్డు,రూపేలతో జతకట్టనున్నట్లు ఎస్బీఐ కార్డ్స్ ఎండీ,సీఈవో రామ్మోహన్ రావు అమర తెలిపారు. డెడ్ లైన్ పొడిగింపు కార్డు టోకనైజేషన్‌పై రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. "వినియోగదారుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని టోకనైజేషన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం. సైబర్ నేరస్తులు వారి వ్యక్తిగత వివరాల్ని దొంగిలించకుండా ఉంచేందుకు ఈ టోకనైజేషన్ వ్యవస్థ ఉపయోగపడుతుంది. కస్టమర్లు, వాటాదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఆర్బీఐ కార్డ్ ఆన్ ఫైల్ (సీఓఎఫ్) టోకనైజేషన్ గడువును 3నెలల పాటు సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు చెప్పారు. అంతకుముందు ఆ గడువు జూన్ 30 వరకే ఉంది. -
పేటీఎం చెల్లింపులు ఇక మరింత భద్రం
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సేవల్లోని వన్97 కమ్యూనికేష న్స్ (పేటీఎం) జూన్ 30 నాటికి వీసా, మాస్టర్ కార్డ్, రూపేకు సంబంధించి 2.8 కోట్ల కార్డుల టోకెనైజేషన్‌ను తన ప్లాట్‌ఫామ్‌పై పూర్తి చేసినట్టు ప్రకటించింది. పేటీఎం యాప్‌పై యాక్టివ్‌గా ఉన్న కార్డుల్లో 80 శాతం కార్డుల టోకెనైజేషన్ ముగిసినట్టు తెలిపింది. చెల్లింపుల వ్యవస్థ మరింత భద్రంగా, సురక్షితంగా చేసే లక్ష్యంతో తీసుకొచ్చిందే టోకెనైజేషన్. ఈ విధానంలో అసలైన కార్డు వివరాలను ప్రత్యామ్నాయ రీడింగ్ కోడ్ (దీన్నే టోకెన్‌గా పిలుస్తున్నారు)తో భర్తీ చేస్తారు. అసలైన కార్డు వివరాలతో లావాదేవీలు జరగవు కనుక మోసాలకు అవకాశం ఉండదు. పీవోఎస్‌లు, క్యూఆర్ కోడ్ చెల్లింపులు ఈ టోకెనైజేషన్ విధానంలో జరుగుతున్నాయి. కార్డు, టోకెన్ కోసం అభ్యర్థించిన సంస్థ (మర్చంట్), గుర్తింపు డివైజ్ (మర్చంట్లు వినియోగించే) కలగలసి ఈ కోడ్ ఉంటుంది. దీన్నే టోకెనైజేషన్‌గా పేర్కొంటారు. ‘‘సురక్షిత, భద్రతతో కూడిన ఆన్లైన్ చెల్లింపులకు పేటీఎం కట్టుబడి ఉంది. ఈ దిశగా ఆర్బీఐ తీసుకొచ్చిన టోకెనైజేషన్ అన్నది పరిశ్రమకు కీలకమైన మైలురాయి వంటిది. కార్డులను టోకెనైజేజ్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించి, పేటీఎం యాప్‌పై అమ లు చేశాం’’అని పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ ప్రకటన విడుదల చేశారు. చదవండి: ష్.. చెప్తే నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు: ఆనంద్ మహీంద్రా -
ఎస్బీఐ కార్డ్, పేటీఎం జోడీ
న్యూఢిల్లీ: ఎస్బీఐ కార్డ్ అండ్ పేమెంట్ సర్వీసెస్, పేటీఎంతో చేతులు కలిపింది. కార్డుదారులు తమ కార్డును చెల్లింపుల పరికరాలపై టోకెనైజ్ చేసుకునేందుకు, పేటీఎం ద్వారా చెల్లింపులు చేసేందుకు భాగస్వామ్యం తోడ్పడుతుందని ఎస్బీఐ కార్డ్ వెల్లడించింది. టోకెనైజేషన్ అంటే.. అసలు కార్డు నంబర్ కనిపించకుండా, దాని స్థానంలో వినూత్నమైన అక్షరాలకు చోటు కల్పిస్తారు. దీంతో కార్డు దారుల అసలు డేటా దుర్వినియోగానికి అవకాశం ఉండదు. ఆండ్రాయిడ్ ఆధారిత ఎన్ఎఫ్సీ (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ సదుపాయం ఉన్న) పరికరాలపైనే కార్డు టోకెనైజేషన్ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఎస్బీఐ కార్డ్ తెలిపింది. ‘‘ప్రస్తుతానికి భారత్ పరిధిలో జారీ చేసే కార్డులే పేటీఎం నెట్‌వర్క్‌పై పనిచేస్తున్నాయి. అయినప్పటికీ కస్టమర్లు వారి ఎస్బీఐ కార్డ్‌ను అంతర్జాతీయంగా ఇతర ప్రాంతాల్లోని పేటీఎం నెట్‌వర్క్‌పైనా వినియోగించుకోవచ్చు’’ అని ఎస్బీఐ కార్డ్ సూచించింది.