ముంబై: ప్రపంచ అతిపెద్ద చెల్లింపుల నెట్‌వర్క్ ‘వీసా’.. ఇక నుంచి తన అన్ని రకాల డెబిట్ కార్డులపై నెలవారీ వాయిదా చెల్లింపు (ఈఎంఐ) సదుపాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ–కామర్స్ సంస్థల నుంచి జరిపే ఆన్‌లైన్ కొనుగోళ్లకు ఈ ప్రయోజనం వర్తిస్తుందని తెలిపింది. దేశీయంగా 4.5 కోట్ల క్రెడిట్ కార్డులు ఉండగా.. 93 కోట్ల డెబిట్ కార్డులు ఉన్నాయి. మొత్తం డెబిట్ కార్డుల వాడకందారుల్లో 22 కోట్ల మందికి క్రెడిట్ సౌలభ్యం ఉంది. బ్యాంకులు, మర్చంట్లను ఒక ప్రత్యేక ప్లాట్‌ఫాం ద్వారా అనుసంధానం చేయడం ద్వారా విస్తృత స్థాయిలో డెబిట్ కార్డుదారులకు కూడా ఈఎంఐ సదుపాయాన్ని అందించనున్నట్లు సంస్థ ప్రొడక్డ్ హెడ్ అరవింద్ రొంటా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment