యూరప్‌యేతర ఉద్యోగులపై వెయ్యిపౌండ్ల సర్‌చార్జ్
యూకే సర్కారు పన్ను
♦ భారత ఐటీ నిపుణులకు మంచి అవకాశం
లండన్: యూకేలో యూరప్‌యేతరులను ఉద్యోగులుగా నియమించుకునే కంపెనీలు ఇకపై ఏడాదికి అదనంగా వెయ్యి పౌండ్ల (దాదాపు రూ.95 వేలు) సర్‌చార్జ్‌ను చెల్లించాల్సి ఉంటుంది. టైర్2 వీసా విధానంలో భాగంగా.. కంపెనీల ‘ఇంట్రా కంపెనీ ట్రాన్స్‌ఫర్’ను సమీక్షించాక యూకే మైగ్రేషన్ అడ్వయిజరీ కమిటీ(మ్యాక్) ఈ సిఫార్సు చేసింది. దీంతో యూకేలో ఉద్యోగానికి వచ్చే వారికి శిక్షణనిచ్చి ఉద్యోగంలో చేర్చుకోవటం కంపెనీలకు భారమవుతుంది. నేరుగా నైపుణ్యమున్న వారికే ఉద్యోగాలివ్వాల్సి ఉంటుంది. కొత్త విధానంతో కనీసం మూడేళ్ల వీసాపై వచ్చే యూరప్‌యేతరులపై కంపెనీలు 3 వేల పౌండ్లు చెల్లించాలి. దీనివల్ల అవి స్థానికులకే శిక్షణనిచ్చి వారికే ఉద్యోగాలిచ్చేందుకు అవకాశం ఉంటుందని మ్యాక్ తన నివేదికలో పేర్కొంది.
నివేదికను యూకే ప్రభుత్వం త్వరగానే ఆమోదించనున్నట్లు సమాచారం. 2015 సెప్టెంబర్ వరకున్న లెక్కల ప్రకారం.. టైర్ 2 వీసా కింద అనుమతి పొందిన వారిలో 90శాతం మంది భారతీయ స్కిల్డ్ వర్కర్లే ఉన్నారని మ్యాక్ తెలిపింది. భారత్‌లోని మల్టీనేషనల్ కంపెనీలు పోటీ వాతావరణం వల్ల యూకేలో ఐటీ ప్రాజెక్టులకోసం భారతీయ ఉద్యోగులను తీసుకొస్తున్నాయంది. యూకేతో పోలిస్తే.. భారత్‌లో వేతనాలు చాలా తక్కువగా ఉండట కారణమంది. భారత్‌లోనూ శిక్షణ సంస్థల మధ్యతో నిపుణులైన ఉద్యోగులు బయటకు వస్తున్నారని.. వారికి యూకే కంపెనీలు మంచి వేతనంతో ఉద్యోగాలిస్తున్నాయ పేర్కొంది. కాగా, 2016 నుంచి 2020 వరకు వెయ్యిమంది యూకే గ్రాడ్యుయేట్లకు శిక్షణ ఇచ్చేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ముందుకొచ్చినట్లు తెలిసింది.