టీమిండియా వుమెన్స్‌ భారీ విజయం | India Women Beat Ireland Women By 116 Runs In ICC Women's Championship, Check Score Details Inside | Sakshi
Sakshi News home page

IND-W Vs IRE-W 2nd ODI: టీమిండియా వుమెన్స్‌ భారీ విజయం

Published Sun, Jan 12 2025 7:19 PM | Last Updated on Mon, Jan 13 2025 12:51 PM

India Women Beat Ireland Women by 116 Runs

రాజ్‌కోట్‌: ఐసీసీ చాంపియన్‌షిప్‌ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా  ఐర్లాండ్‌ మహిళలతో జరిగిన రెండో వన్డేలో భారత్‌ మహిళలు భారీ విజయం సాధించారు. రెండో వన్డేలో భారత్‌ 116 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఫలితంగా సిరీస్‌ను ఇంకా మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది భారత్‌.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలోఐదు వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది.రోడ్రిగ్స్‌(102) సెంచరీతో కదం తొక్కగా, హర్లీన్‌ డియోల్‌(89), మంధనా(73), ప్రతీకా రావల్‌(67)లు హాఫ్‌ సెంచరీలతో మెరిశారు.  దాంతో భారత్‌ 351 పరుగుల లక్ష్యాన్ని స్కోరు బోర్డుపై ఉంచింది.

అనంతరం బ్యాటింగ్‌ దిగిన ఐర్లాండ్‌ 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కౌల్టర్‌ రిలీ(80) మాత్రమే ఆ జట్టులో టాప్‌ స్కోరర్‌గా నిలవడంతో ఐర్లాండ్‌కు ఓటమి తప్పలేదు. భారత మహిళ జట్టులోని బౌలర్లలో దీప్తి శర్మ మూడు, ప్రియా మిశ్రా రెండు వికెట్లతో రాణించగా,టిటిస్‌ బాదు,  సాయలి తలో వికెట్‌ సాధించారు. అంతకుముందు జరిగిన తొలి వన్డేలో భారత్‌ 6 వికె  ట్ల తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.  ఇరు జ  ట్ల మధ్య మూడో వన్డే బుధవారం జరుగనుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement