ICC championship
-
కోహ్లీని తప్పిస్తే టీమిండియా ఐసీసీ టోఫ్రీ గెలుస్తుందా..?
కరాచీ: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి జట్టు సారధి విరాట్ కోహ్లీని బాధ్యున్ని చేస్తూ జరుగుతున్న రాద్దాంతంపై పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ స్పందించాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా ఘన చరిత్ర కలిగిన కోహ్లీని కేవలం ఒక్క మ్యాచ్ ఓటమి వల్ల ఈ స్థాయిలో నిందించడాన్ని ఆయన తప్పుపట్టాడు. కోహ్లీ సాధించిన విజయాలపై అవగాహన లేని వాళ్లే ఆయనపై ముప్పేట దాడి చేస్తున్నారని దుయ్యబట్టాడు. కెప్టెన్‌గా కోహ్లీని తప్పిస్తే టీమిండియా ఐసీసీ టోఫ్రీ గెలుస్తుందా అని ప్రశ్నించాడు. ఈ విషయంలో ఒక్క కోహ్లీని మాత్రమే తప్పుపట్టడం ఏమాత్రం సరికాదని, కోహ్లీ స్థానంలో మరెవరినైనా కెప్టెన్‌గా నియమిస్తే ఐసీసీ ట్రోఫీ గెలుస్తాడని గ్యారంటీ ఇవ్వగలరా అని నిలదీశాడు. కీలక టోర్నీల్లో ఎందుకు విఫలమవుతున్నారో జట్టుగా విశ్లేషించుకోవాలని, ఫైనల్ ఫోబియా వీడేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించాడు. టీమిండియా కెప్టెన్‌గా కోహ్లీనే సరైన వ్యక్తి అని, భవిష్యత్తులో అతని సారధ్యంలోనే టీమిండియా ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తుందని కోహ్లీకి బాసటగా నిలిచాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమికి కోహ్లీ కెప్టెన్సీనే కారణమని, అందుకు జట్టు సారధ్య బాధ్యతల నుంచి అతన్ని తప్పించాలని వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఈ దాయాది దేశ ఆటగాడు కోహ్లీకి మద్దతుగా నిలవడం చర్చనీయాంశంగా మారింది. 'మై మాస్టర్ క్రికెట్ కోచ్' అనే యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆధునిక క్రికెట్లో కోహ్లీ గొప్ప ఆటగాడని, అంత కంటే అద్భుతమైన కెప్టెన్ అని కొనియాడాడు. మైదానంలో కోహ్లీ దూకుడుగా కనిపిస్తాడని, ఎంతో భావోద్వేగంతో ఉంటాడని, ఆ లక్షణాలే అతన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేశాయని అభిప్రాయపడ్డాడు. భారత క్రికెట్లో మార్పు సౌరవ్ గంగూలీతో మొదలైందని, ఆతర్వాత ధోనీ, కోహ్లీలు దాన్ని కంటిన్యూ చేశారని పేర్కొన్నాడు. ఇక, ఐసీసీ ట్రోఫీ గెలవలేదన్న కారణంగా కోహ్లీని సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలంటున్న వారికి ఈ పాక్ వికెట్ కీపర్ తారాస్థాయిలో చురకలంటించాడు. ఒక్క ఐసీసీ టోఫ్రీ మినహాయించి కోహ్లీ సారధ్యంలో టీమిండియా ఎన్నో చారిత్రక విజయాలు సాధించిందన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఇదిలా ఉంటే, ఎన్నో అంచనాల నడుమ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. న్యూజిలాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా జరిగిన ఈ మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా.. కీలక ఫైనల్లో తడబడడంతో భారత మాజీలు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కోహ్లీ.. కనీసం డ్రా కోసం కూడా ప్రయత్నించలేదని మండిపడుతున్నారు. చదవండి: మ్యాచ్ రిఫరికి కరోనా.. ఆందోళనలో క్రికెటర్లు -
‘ఏక్తా’ ధాటికి ఇంగ్లండ్ ప్యాకప్
ముంబై: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు జయభేరి మోగించింది. ఐసీసీ చాంపియన్ షిప్లో భాగంగా ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ తొలి మ్యాచ్‌లో మిథాలీ సేన 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పర్యాటక జట్టు స్పిన్ ఉచ్చులో చిక్కుకుపోయింది. టీమిండియా బౌలర్లు ఏక్తా బిస్త్(4/25), దీప్తి శర్మ(2/33), శిఖా పాండే(2/21), గోస్వామి(1/19)ల దెబ్బకు ఇంగ్లండ్ జట్టు 41 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ సారథి హెదర్ నైట్(39 నాటౌట్), ఆల్‌రౌండర్ సీవర్(44)లు మాత్రమే రాణించారు. ఏ దశలోనూ పర్యాటక జట్టను కోలుకోనీయకుండా ఆ జట్టు పతనాన్ని శాసించిన ఏక్తాబిస్త్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. రాణించిన మిథాలీ, రోడ్రిగ్స్ అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. స్మృతి మంధాన (24), రోడ్రిగ్స్ (48)లు తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించారు. అనంతరం ఈ జోడిని ఎల్విస్ విడదీసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ(7) వెంటనే వేనుదిరగగా.. రోడ్రిగ్‌తో కలిసి మిథాలీ(44) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. అనంతరం ఇరువురు ఔటైన తర్వాత మిడిలార్డర్ చేతులెత్తేయడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమైన హర్మన్ ప్రీత్ స్థానంలో జట్టులోకి వచ్చిన హర్లీన్ డియోల్(2) పూర్తిగా నిరాశపరిచింది. చివర్లో తాన్యా భాటియా(25), గోస్వామి(30)లు రాణించడంతో టీమిండియా 202 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఎల్విస్, సీవిర్, సోఫీ ఎలెక్‌స్టోన్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ష్రబ్‌షోల్ ఒక్క వికెట్ దక్కించుకున్నారు. -
భారత్‌తో వన్డే: ఇంగ్లండ్ లక్ష్యం 203
ముంబై: ఐసీసీ చాంపియన్ షిప్లో భాగంగా ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌ల తొలి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు తడబడింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పరుగులు చేయడానికి నానా ఇబ్బందులు పడ్డారు. దీంతో మిథాలీ సేన పర్యాటక జట్టుకు 203 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ మరోసారి మిడిలార్డర్ వైఫల్యం చెందడంతో 49.4 ఓవర్లలో కేవలం 202 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా ఓపెనర్ రోడ్రిగ్స్(48), సారథి మిథాలీ రాజ్(44)లు రాణించారు. దీంతో ఓ క్రమంలో 92 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి.. పటిష్ట స్థితిలో ఉందనుకున్న తరుణంలో మిడిలార్డర్ బ్యాటర్స్ చేతులెత్తేశారు. చివర్లో తాన్య భాటియా(25), గోస్వామి(30)లు రాణించడంతో ఆమాత్రం స్కోరైనా నమోదైంది. గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమైన హర్మన్ ప్రీత్ స్థానంలో జట్టులోకి వచ్చిన హర్లీన్ డియోల్(2) పూర్తిగా నిరాశపరిచింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఎల్విస్, సీవిర్, సోఫీ ఎలెక్‌స్టోన్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ష్రబ్‌షోల్ ఒక్క వికెట్ దక్కించుకున్నారు. -
మంధాన మెరుపులు.. భారత్ ఘన విజయం
నేపియర్: న్యూజిలాండ్ మహిళలతో జరిగిన తొలి వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళలు 33.0 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించారు. భారత ఓపెనర్లు స్మృతీ మంధాన( 105;104 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకం సాధించగా, జమీమా రోడ్రిగ్స్(81 నాటౌట్; 94 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నారు. ఈ జోడి తొలి వికెట్‌కు 190 పరుగులు జోడించి భారత్ ఘన విజయం సాధించడంలో సహకరించారు. న్యూజిలాండ్ నిర్దేశించిన సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంధాన, రోడ్రిగ్స్‌లు ధాటిగా బ్యాటింగ్ చేశారు. న్యూజిలాండ్ బౌలర్లను ఓ ఆటాడుకుంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే మంథాన సెంచరీతో మెరవగా, రోడ్రిగ్స్ అర్థ శతకం నమోదు చేశారు. కాగా, భారత్ విజయానికి మూడు పరుగుల దూరంలో ఉండగా మంధాన భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్ చేరారు. అంతకుముందు న్యూజిలాండ్ 48.4 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచిన భారత్.. ముందుగా కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో బ్యాటింగ్ ఆరంభించిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు సుజీ బేట్స్(36), సోఫీ డివైన్(28)లు శుభారంభం అందించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించిన తర్వాత సోఫీ డివైన్ పెవిలియన్ చేరారు. ఆపై ఫస్ట్ డౌన్లో వచ్చిన లారెన్ డౌన్ డకౌట్‌గా ఔటయ్యారు. కాసేపటికి సుజీ బేట్స్ కూడా పెవిలియన్ బాట పట్టడంతో కివీస్ 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అటు తర్వాత సాటెర్వైట్(31), అమీలా కెర్(28)లు 49 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించడంతో కివీస్ తేరుకుంది. వీరిద్దరూ 17 పరుగుల వ్యవధిలో ఔట్ కావడంతో మళ్లీ కివీస్ పరిస్థితి మొదటికొచ్చింది. చివర్లో హనహ్ రోవ్(25) ఫర్వాలేదనిపించారు. ఏక్తాబిస్త్, పూనమ్ యాదవ్‌లు తలో మూడు వికెట్లు సాధించగా, దీప్తి శర్మ రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు. శిఖా పాండేకు వికెట్ దక్కింది. -
192 పరుగులకే ఆలౌట్ చేశారు..!
నేపియర్: ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత మహిళలతో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ 192 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్ల ధాటికి విలవిల్లాడిన న్యూజిలాండ్ మహిళలు కనీసం రెండొందల పరుగుల మార్కును చేరకుండానే 48.4 ఓవర్లలో ఆలౌటయ్యారు. ఏక్తాబిస్త్, పూనమ్ యాదవ్‌లు తలో మూడు వికెట్లు సాధించగా, దీప్తి శర్మ రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు. శిఖా పాండేకు వికెట్ దక్కింది. టాస్ గెలిచిన భారత్.. ముందుగా కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో బ్యాటింగ్ ఆరంభించిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు సుజీ బేట్స్(36), సోఫీ డివైన్(28)లు శుభారంభం అందించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించిన తర్వాత సోఫీ డివైన్ పెవిలియన్ చేరారు. ఆపై ఫస్ట్ డౌన్లో వచ్చిన లారెన్ డౌన్ డకౌట్‌గా ఔటయ్యారు. కాసేపటికి సుజీ బేట్స్ కూడా పెవిలియన్ బాట పట్టడంతో కివీస్ 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అటు తర్వాత సాటెర్వైట్(31), అమీలా కెర్(28)లు 49 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించడంతో కివీస్ తేరుకుంది. వీరిద్దరూ 17 పరుగుల వ్యవధిలో ఔట్ కావడంతో మళ్లీ కివీస్ పరిస్థితి మొదటికొచ్చింది. చివర్లో హనహ్ రోవ్(25) ఫర్వాలేదనిపించారు. -
మిథాలీ సెంచరీ వృథా
గాలె: కెప్టెన్ మిథాలీ రాజ్ (143 బంతుల్లో 125 నాటౌట్; 14 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్ అత్యుత్తమ వ్యక్తిగత స్కోరుతో అజేయ శతకం సాధించినా... బౌలర్ల వైఫల్యంతో ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టుకు ఓటమి ఎదురైంది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేయలేకపోయినా 2–1తో దక్కించుకుంది. తొలుత భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఖాతా తెరవకుండానే యువ ఓపెనర్ జెమీమా రోడ్రిగ్స్ (0) పెవిలియన్ చేరడంతో తొలి ఓవర్లోనే క్రీజులోకొచ్చిన మిథాలీ చివరి వరకు అజేయంగా నిలిచి జట్టుకు మంచి స్కోరు అందించింది. స్మృతి మంధాన (51; 6 ఫోర్లు)తో కలిసి రెండో వికెట్‌కు 102 పరుగులు... హర్మన్ ప్రీత్ కౌర్ (17)తో మూడో వికెట్‌కు 45 పరుగులు... దీప్తి శర్మతో ఐదో వికెట్‌కు 92 పరుగులు జత చేసింది. ఈ క్రమంలో మిథాలీ 126 బంతుల్లో ఏడో వన్డే సెంచరీ పూర్తి చేసుకుంది. అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.5 ఓవర్లలో 7 వికెట్లకు 257 పరుగులు చేసి మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే 0–2తో సిరీస్ కోల్పోయిన లంక జట్టుకు చివరి మ్యాచ్‌లో గెలుపు కాస్త ఊరటనిచ్చింది. కెప్టెన్ జయాంగని ఆటపట్టు (133 బంతుల్లో 115; 13 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించగా... హాసిని పెరీరా (45; 4 పోర్లు, 2 సిక్స్‌లు) ఆకట్టుకుంది. భారత బౌలర్లలో జులన్ గోస్వామి, మాన్సి జోషి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
వడోదర : ఐసీసీ చాంపియన్ షిప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే మొదటి వన్డేలో ఓడిపోయిన టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి, సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. అస్వస్థత కారణంగా మొదటి వన్డేకు దూరం అయినా కెప్టెన్ మిథాలి రాజ్ అందుబాటులోకి రావడం భారత్‌కు కలిసొచ్చే అంశం. -
కివీస్ పై భారత్ విజయకేతనం
బెంగళూరు: ఐసీసీ ఉమెన్స్ చాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్ పై 17 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 44.3 ఓవర్లలో 142 పరుగులు చేసి ఆలౌటైంది. ఛేజింగ్ కు దిగిన న్యూజిలాండ్ మహిళల జట్టు 45.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటవడంతో భారత్ విజయకేతనం ఎగురవేసింది. న్యూజిలాండ్ తో భారత్ ఆడుతున్న ద్వైపాక్షిక సిరీస్ లో ఇది తొలి వన్డే మ్యాచ్. ఆల్ రౌండర్ ఝులన్ గోస్వామి అర్ధ శతకం (67 బంతుల్లో 57 పరుగులు: 6 ఫోర్లు, 1 సిక్సర్)తో రాణించింది. భారత్ బౌలర్లలో స్నేహ రాణే 26 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది.