కివీస్ పై భారత్ విజయకేతనం | Indian womens team beats newzeland by 17 runs | Sakshi
Sakshi News home page

కివీస్ పై భారత్ విజయకేతనం

Published Sun, Jun 28 2015 4:49 PM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

Indian womens team beats newzeland by 17 runs

బెంగళూరు: ఐసీసీ ఉమెన్స్ చాంపియన్షిప్లో న్యూజిలాండ్ పై 17 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 44.3 ఓవర్లలో 142 పరుగులు చేసి ఆలౌటైంది. ఛేజింగ్ కు దిగిన న్యూజిలాండ్ మహిళల జట్టు 45.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటవడంతో భారత్ విజయకేతనం ఎగురవేసింది.

న్యూజిలాండ్ తో భారత్ ఆడుతున్న ద్వైపాక్షిక సిరీస్ లో ఇది తొలి వన్డే మ్యాచ్. ఆల్ రౌండర్ ఝులన్ గోస్వామి అర్ధ శతకం (67 బంతుల్లో 57 పరుగులు: 6 ఫోర్లు, 1 సిక్సర్)తో రాణించింది. భారత్ బౌలర్లలో స్నేహ రాణే 26 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement