Indian womens team won
-
India Women vs England Women 2022 1st ODI: మెరిసిన స్మృతి, హర్మన్‌ప్రీత్
హోవ్: ఇంగ్లండ్ చేతిలో టి20 సిరీస్‌ను కోల్పోయిన భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌లో శుభారంభం చేసింది. ముందుగా పదునైన బౌలింగ్‌తో ఆతిథ్య జట్టును కట్టడి చేసిన టీమ్... ఆ తర్వాత ముగ్గురు బ్యాటర్ల అర్ధ సెంచరీలతో అలవోకగా లక్ష్యాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ మహిళలను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 227 పరుగులే చేయగలిగింది. అలైస్ డేవిడ్సన్ (61 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... డానీ వ్యాట్ (43; 3 ఫోర్లు), సోఫీ ఎకెల్‌స్టోన్ (31; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. ఒక దశలో 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఆరో వికెట్ చేజార్చుకునే సమయానికి 128 వద్ద నిలిచింది. అయితే ఏడో వికెట్‌కు వ్యాట్‌తో 50 పరుగులు, ఎనిమిదో వికెట్‌కు ఎకెల్‌స్టోన్‌తో 49 పరుగులు జోడించి అలైస్ తమ జట్టును ఆదుకుంది. ఇన్నింగ్స్‌లో ఎక్కువ భాగం నెమ్మదిగా ఆడిన ఇంగ్లండ్ చివరి 6 ఓవర్లలో మాత్రం 45 పరుగులు సాధించింది. దీప్తి శర్మకు 2 వికెట్లు దక్కగా... జులన్ గోస్వామి, హర్లీన్, రాజేశ్వరి, మేఘన, స్నేహ్ రాణా తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 44.2 ఓవర్లలో 3 వికెట్లకు 232 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (99 బంతుల్లో 91; 10 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (94 బంతుల్లో 74 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), యస్తిక భాటియా (47 బంతుల్లో 50; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. యస్తికతో రెండో వికెట్‌కు 96 పరుగులు జోడించిన స్మృతి, హర్మన్‌తో మూడో వికెట్‌కు 99 పరుగులు జోడించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లగా, రెండో వన్డే బుధవారం కాంటర్బరీలో జరుగుతుంది. -
Commonwealth Games 2022: భారత్ ధనాధన్
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్ టి20 క్రికెట్ ఈవెంట్లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో దాయాది పాకిస్తాన్‌ను కంగు తినిపించింది. తద్వారా సెమీఫైనల్ రేసులో నిలిచింది. గ్రూప్ ‘ఎ’లో ఆదివారం జరిగిన ఈ పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మొదట పాకిస్తాన్ మహిళల జట్టు 18 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. మునీబా అలీ (30 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. రాధ యాదవ్, స్నేహ్ రాణా చెరో 2 వికెట్లు తీశారు. రేణుక, మేఘన సింగ్, షఫాలీ వర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 11.4 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి గెలిచింది. స్మృతి మంధాన (42 బంతుల్లో 63 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), షఫాలీ వర్మ (9 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్), సబ్బినేని మేఘన (14; 2 ఫోర్లు) ధాటిగా ఆడి భారత విజయాన్ని ఖాయం చేశారు. బుధవారం బార్బడోస్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ తలపడుతుంది. -
అమ్మాయిలూ అదరగొట్టారు
వడోదర: టెస్టుల్లో పురుషుల జట్టు దక్షిణాఫ్రికాను కంగుతినిపిస్తుంటే... వన్డేల్లో భారత మహిళల జట్టు కూడా సఫారీని చిత్తు చిత్తు చేస్తోంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మిథాలీ బృందం 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. భారత్ చేతిలో దక్షిణాఫ్రికా వైట్‌వాష్ కావడం ఇదే మొదటిసారి. సోమవారం జరిగిన ఆఖరి వన్డేలో భారత్ తక్కువ స్కోరునే కాపాడుకొని 6 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు 45.5 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. టాపార్డర్ నుంచి టెయిలెండర్ల వరకు ఇద్దరు మినహా మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. హర్మన్‌ప్రీత్ కౌర్ (76 బంతుల్లో 38; 5 ఫోర్లు), శిఖా పాండే (40 బంతుల్లో 35; 6 ఫోర్లు) కాస్త మెరుగ్గా ఆడారు. సఫారీ బౌలర్లలో మరిజన్నె కప్ 3, షబ్నమ్, అయబొంగ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత కష్టసాధ్యంకాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 48 ఓవర్లలో 140 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత స్పిన్నర్లు ఏక్తా బిష్త్ 3, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్ చెరో 2 వికెట్లు తీశారు. మిథాలీకి ‘వంద’నం... తాజా గెలుపుతో హైదరాబాద్ క్రికెటర్, భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మరో ఘనత సాధించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో 100 విజయాలు సాధించిన రెండో కెప్టెన్‌గా గుర్తింపు పొందింది. 20 ఏళ్ల క్రికెట్ కెరీర్లో మిథాలీ రాజ్ తన సారథ్యంలో భారత్‌కు వందో విజయాన్ని (వన్డేల్లో 80+టి20ల్లో 17+టెస్టుల్లో 3) అందించింది. చార్లోట్ ఎడ్వర్డ్స్ (142; ఇంగ్లండ్) మాత్రమే మిథాలీ కంటే ముందుంది. -
ఐదోసారీ మనదే టైటిల్
బిరాట్‌నగర్ (నేపాల్): తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంటూ వరుసగా ఐదోసారి భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు దక్షిణాసియా (శాఫ్) పుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 3–1 గోల్స్ తేడాతో ఆతిథ్య నేపాల్ జట్టును ఓడించింది. ఈ టోర్నీ చరిత్రలో భారత్‌కిది వరుసగా 23వ విజయం కావడం విశేషం. గతంలో భారత్ 2010, 2012, 2014, 2016లలో ఈ టైటిల్‌ను సాధించింది. నేపాల్‌తో జరిగిన ఫైనల్లో ఆట 28వ నిమిషంలో దలీమా చిబ్బెర్ గోల్‌తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 33వ నిమిషంలో సబిత్రా భండారి గోల్‌తో నేపాల్ స్కోరును 1–1తో సమం చేసింది. విరామ సమయానికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. రెండో అర్ధ భాగంలోని 63వ నిమిషంలో దంగ్మె గ్రేస్ గోల్‌తో భారత్ 2–1తో ముందంజ వేసింది. 78వ నిమిషంలో అంజూ తమాంగ్ గోల్‌తో భారత ఆధిక్యం 3–1కి పెరిగింది. అనంతరం నేపాల్ స్కోరు చేసేందుకు ప్రయత్నిం చినా భారత రక్షణపంక్తి వాటిని సమర్థంగా తిప్పికొట్టింది. ఈ టోర్నీలో మొత్తం 33 గోల్స్ నమోదు కాగా.. భారత్ నుంచి అత్యధికంగా ఇందుమతి నాలుగు గోల్స్ చేసింది. -
కివీస్ పై భారత్ విజయకేతనం
బెంగళూరు: ఐసీసీ ఉమెన్స్ చాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్ పై 17 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 44.3 ఓవర్లలో 142 పరుగులు చేసి ఆలౌటైంది. ఛేజింగ్ కు దిగిన న్యూజిలాండ్ మహిళల జట్టు 45.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటవడంతో భారత్ విజయకేతనం ఎగురవేసింది. న్యూజిలాండ్ తో భారత్ ఆడుతున్న ద్వైపాక్షిక సిరీస్ లో ఇది తొలి వన్డే మ్యాచ్. ఆల్ రౌండర్ ఝులన్ గోస్వామి అర్ధ శతకం (67 బంతుల్లో 57 పరుగులు: 6 ఫోర్లు, 1 సిక్సర్)తో రాణించింది. భారత్ బౌలర్లలో స్నేహ రాణే 26 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది.