బిరాట్‌నగర్ (నేపాల్): తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంటూ వరుసగా ఐదోసారి భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు దక్షిణాసియా (శాఫ్) పుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 3–1 గోల్స్ తేడాతో ఆతిథ్య నేపాల్ జట్టును ఓడించింది. ఈ టోర్నీ చరిత్రలో భారత్‌కిది వరుసగా 23వ విజయం కావడం విశేషం. గతంలో భారత్ 2010, 2012, 2014, 2016లలో ఈ టైటిల్‌ను సాధించింది. నేపాల్‌తో జరిగిన ఫైనల్లో ఆట 28వ నిమిషంలో దలీమా చిబ్బెర్ గోల్‌తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
అయితే 33వ నిమిషంలో సబిత్రా భండారి గోల్‌తో నేపాల్ స్కోరును 1–1తో సమం చేసింది. విరామ సమయానికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. రెండో అర్ధ భాగంలోని 63వ నిమిషంలో దంగ్‌మె గ్రేస్ గోల్‌తో భారత్ 2–1తో ముందంజ వేసింది. 78వ నిమిషంలో అంజూ తమాంగ్ గోల్‌తో భారత ఆధిక్యం 3–1కి పెరిగింది. అనంతరం నేపాల్ స్కోరు చేసేందుకు ప్రయత్నిం చినా భారత రక్షణపంక్తి వాటిని సమర్థంగా తిప్పికొట్టింది. ఈ టోర్నీలో మొత్తం 33 గోల్స్ నమోదు కాగా.. భారత్ నుంచి అత్యధికంగా ఇందుమతి నాలుగు గోల్స్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment