ఫుట్బాల్లో నేపాల్ కు రెండో విజయం | Nepal girls win second straight match in SAG football | Sakshi
Sakshi News home page

ఫుట్బాల్లో నేపాల్ కు రెండో విజయం

Published Sun, Feb 7 2016 8:21 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

Nepal girls win second straight match in SAG football

షిలాంగ్:దక్షిణాసియా క్రీడల్లో భాగంగా మహిళల ఫుట్ బాల్ లో నేపాల్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. ఆదివారం మాల్దీవులతో జరిగిన మ్యాచ్ లో నేపాల్ 2-0తేడాతో విజయం సాధించింది.  నేపాల్ కెప్టెన్ అను మాలిక్ , నిరూ థాపాలు చెరో గోల్ చేసి విజయంలో తోడ్పడ్డారు.

 

మ్యాచ్ ఆరంభమైన తొలి నిమిషంలోనే పటిష్ట నేపాల్ కు గోల్ చేసే అవకాశం వచ్చినా మాల్దీవ్ గోల్ కీపర్ అబ్దుల్ రజాక్ అడ్డుకున్నాడు. కాగా, ఆట 36 వ నిమిషంలో సబితా పాస్ ను అందిపుచ్చుకున్నఅను గోల్ గా  మలచి నేపాల్ ను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది.  ఆ తరువాత మాల్దీవులు స్కోరును సమం చేద్దామని ప్రయత్నించినా  ఫలితం రాలేదు. అయితే 89వ నిమిషంలో నేపాల్ మరో గోల్ చేసి 2-0 తేడాతో విజయం సొంతం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement