నేపియర్: ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత మహిళలతో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ 192 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్ల ధాటికి విలవిల్లాడిన న్యూజిలాండ్ మహిళలు కనీసం రెండొందల పరుగుల మార్కును చేరకుండానే 48.4 ఓవర్లలో ఆలౌటయ్యారు. ఏక్తాబిస్త్, పూనమ్ యాదవ్‌లు తలో మూడు వికెట్లు సాధించగా, దీప్తి శర్మ రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు. శిఖా పాండేకు వికెట్ దక్కింది.
టాస్ గెలిచిన భారత్.. ముందుగా కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో బ్యాటింగ్ ఆరంభించిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు సుజీ బేట్స్(36), సోఫీ డివైన్(28)లు శుభారంభం అందించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించిన తర్వాత సోఫీ డివైన్ పెవిలియన్ చేరారు. ఆపై ఫస్ట్ డౌన్‌లో వచ్చిన లారెన్ డౌన్ డకౌట్‌గా ఔటయ్యారు. కాసేపటికి సుజీ బేట్స్ కూడా పెవిలియన్ బాట పట్టడంతో కివీస్ 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అటు తర్వాత సాటెర్‌వైట్(31), అమీలా కెర్(28)లు 49 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించడంతో కివీస్ తేరుకుంది. వీరిద్దరూ 17 పరుగుల వ్యవధిలో ఔట్ కావడంతో మళ్లీ కివీస్ పరిస్థితి మొదటికొచ‍్చింది. చివర్లో హనహ్ రోవ్(25) ఫర్వాలేదనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment