ముంబై: ఐసీసీ చాంపియన్ షిప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌ల తొలి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు తడబడింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పరుగులు చేయడానికి నానా ఇబ్బందులు పడ్డారు. దీంతో మిథాలీ సేన పర్యాటక జట్టుకు 203 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ మరోసారి మిడిలార్డర్ వైఫల్యం చెందడంతో 49.4 ఓవర్లలో కేవలం 202 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా ఓపెనర్ రోడ్రిగ్స్(48), సారథి మిథాలీ రాజ్(44)లు రాణించారు.
దీంతో ఓ క్రమంలో 92 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి.. పటిష్ట స్థితిలో ఉందనుకున్న తరుణంలో మిడిలార్డర్ బ్యాటర్స్ చేతులెత్తేశారు. చివర్లో తాన్య భాటియా(25), గోస్వామి(30)లు రాణించడంతో ఆమాత్రం స్కోరైనా నమోదైంది. గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమైన హర్మన్ ప్రీత్ స్థానంలో జట్టులోకి వచ్చిన హర్లీన్ డియోల్(2) పూర్తిగా నిరాశపరిచింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఎల్విస్, సీవిర్, సోఫీ ఎలెక్‌స్టోన్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ష్రబ్‌షోల్ ఒక్క వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment