న్యూఢిల్లీ: స్వలింప సంపర్క వివాహాలకు ప్రత్యేక వివాహం చట్టం వర్తింపజేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు గేలు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్‌పై నేడు (శుక్రవారం) విచారణ జరిపింది. దీనిపై విచారణ జరిపేందుకు అంగీకరించింది.
ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు అటార్నీ జనరల్ కూడా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. దీనిపై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ అప్పుడే చేపడతామని పేర్కొంది.
హైదరాబాద్ జంట సుప్రియో, అభయ్‌లు గత పదేళ్ల నుంచి కలిసి ఉంటున్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో ఇద్దరు వైరస్ బారినపడ్డారు. కరోనా నుంచి కోలుకున్నాక ఇద్దరూ 2021 డిసెంబర్‌లో వేడుక నిర్వహించారు. ఆ సంబరాలకు పేరెంట్స్, ఫ్యామిలీతో పాటు మిత్రులు హాజరయ్యారు. పర్త్ పిరోజ్ మెహరోత్రా, ఉదయ్ రాజ్ అనే మరో జంట రెండో పిటిషన్ వేసింది. సేమ్ సెక్స్ మ్యారేజ్‌ను గుర్తించకపోతే అది సమానత్వ హక్కును ఉల్లంఘించినట్లే అవుతుందని పేర్కొంది.
చదవండి: గుజరాత్ ఎన్నికలు: 100 మంది అభ్యర్థులపై హత్య, అత్యాచారం ఆరోపణలు..
Comments
Please login to add a commentAdd a comment