Centre Rs 18000 Crore Returned to Banks From Vijay Mallya, Nirav Modi and Others - Sakshi
Sakshi News home page

విజయ్‌మాల్యా, తదితరుల నుంచి బ్యాంకులకు రూ. 18 వేల కోట్లు రికవరీ: కేంద్రం

Published Wed, Feb 23 2022 6:58 PM | Last Updated on Wed, Feb 23 2022 7:50 PM

Center Says Rs 18000 Crore Returned Banks Vijay Mallya Others - Sakshi

న్యూఢిల్లీ: పరారీలో ఉన్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల వంటి కుబేరుల నుంచి దాదాపు రూ.18 వేల కోట్లు బ్యాంకులకు తిరిగి ఇచ్చామని కేంద్రం ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.  ఈ మేరకు కేంద్రం మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కి ఇచ్చిన విస్తృత అధికారాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల పై విచారణ జరుపుతున్న​ సుప్రీంకోర్టుకి బుధవారం కేంద్రం వెల్లడించింది.

అంతేకాదు విదేశాల్లోని పరిస్థితులతో పోలిస్తే భారతదేశంలో పీఎంఎల్‌ఏ కింద చాలా తక్కువ సంఖ్యలో కేసులను దర్యాప్తు చేస్తున్నామని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, దినేశ్ మహేశ్వరి, సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనానికి కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో కేంద్రం సుప్రీం కోర్టులో యూకేని ఉదహరించింది, ఇక్కడ మనీలాండరింగ్ చట్టం కింద ఒక ఏడాదిలో 7,900 కేసులు నమోదయ్యాయని, యూఎస్‌ (1,532), చైనా (4,691), ఆస్ట్రియా (1,036), హాంకాంగ్ (1,823), బెల్జియం (1,862),  రష్యా (2,764) నమోదవుతున్నాయని వివరించింది.

భారత్‌లో 4 వేల పీఎంఎల్‌ఏ కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోందని తెలిపింది. అయితే సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న నేరాల మొత్తం ఆదాయం రూ. 67,000 కోట్లు అని పేర్కొంది. గత 5 ఏళ్లలో ప్రతి ఏడాది విచారణకు తీసుకున్న కేసుల సంఖ్య 2015-16లో 111 కేసుల ఉండగా.. 2020-21 నాటికి 981గా మారుతుందని కేంద్రం తెలిపింది. అంతేకాదు ఇటువంటి నేరాలకు సంబంధించి 33 లక్షల ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, కానీ 2 వేల కేసులను మాత్రమే విచారణకు స్వీకరించినట్లు కేంద్రం వెల్లడించింది.

(చదవండి: ఒమిక్రాన్‌ సైలెంట్‌​ కిల్లర్‌!... కోలుకున్నా ఇంకా బాధిస్తునే ఉంటుంది!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement