ఆ ముగ్గురి 19వేల కోట్ల ఆస్తుల్ని అటాచ్‌ చేశాం  | Rs 19,000 crore recovered from Vijay Mallya, Nirav Modi and Mehul Choksi | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురి 19వేల కోట్ల ఆస్తుల్ని అటాచ్‌ చేశాం 

Published Fri, Feb 25 2022 6:33 AM | Last Updated on Fri, Feb 25 2022 6:33 AM

Rs 19,000 crore recovered from Vijay Mallya, Nirav Modi and Mehul Choksi - Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక నేరగాళ్లయిన విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీలకు చెందిన రూ.19వేల కోట్లకు పైగా ఆస్తుల్ని అటాచ్‌ చేసినట్లు కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. రూ.22,500 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడిన ఈ ముగ్గురు నేరగాళ్లపై సకాలంలో చర్యలు తీసుకోవడం వల్లనే ఇది సాధ్యమైందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా పేర్కొన్నారు.

మనీ ల్యాండరింగ్‌ చట్టంలోని కొన్ని నిబంధనలకు వక్రభాష్యాలు చెబుతున్నారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్‌ ఎ.ఎం.ఖన్వీల్కర్‌ నేతృత్వంలోని ధర్మాసనానికి ఆయన ఈ వివరాలు వెల్లడించారు. సకాలంలో తీసుకున్న చట్టపరమైన చర్యల ఫలితంగా ఈ ముగ్గురికి చెందిన రూ.15,113 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు తిరిగి అప్పగించినట్లు చెప్పారు. ఈ కేసుపై వాదనలు వచ్చే వారం కూడా కొనసాగనున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement