బెంగుళూరు : పౌరసత్వ నిరసనకారులపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అప్పచ్చు రంజన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఏఏ నిరసనల పేరుతో పాకిస్తాన్ జిందాబాద్ అంటున్న వారిని కాల్చి చంపేందుకు చట్టం తేవాలని పేర్కొన్నారు. లేదంటే అలాంటి వారిని పాకిస్తాన్‌కు పంపించాలని అన్నారు. ‘భారత్‌లో ఉంటూ.. ఇక్కడి తిండి తింటూ.. పాకిస్తాన్ పాట పాడేవాళ్లను కాల్చి చంపాలి. లేదంటే వారిని పాకిస్తాన్‌కు తరిమేయాలి. అలాంటి వారిపట్ల సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. వారిపై నమోదైన కేసుల విషయంలో కూడా ఉదారత అవసం లేదు’అని కొడగులో సోమవారం ఆయన పేర్కొన్నారు.
(చదవండి : అమూల్యకు 14 రోజుల కస్టడీ)
కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాటిల్ కూడా ఆదివారం ఇదేరకమైన కామెంట్లు చేశారు. పౌర నిరసనకారులు, పాకిస్తాన్ జిందాబాద్ కామెంట్లు చేసేవారిని కనిపిస్తే కాల్చండి (షూట్ ఎట్ సైట్) ఆర్డర్స్ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తేవాలని పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తానని అన్నారు. కాగా, ‘సేవ్ కాన్సిస్టిట్యూషన్’ పేరుతో గురువారం బెంగుళూరులో జరిగిన సీఏఏ నిరసన సభలో అమూల్య లియోన్ అనే యువతి ‘పాకిస్తాన్ జిందాబాద్’ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మరికొందరు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమూల్యపై దేశద్రోహం కేసు నమోదైంది. ఆమెను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.
(చదవండి : నిరసనలో నిరసన.. అదుపులోకి మరో యువతి!)
పాకిస్తాన్ జిందాబాద్; ‘కాల్చి పారెయ్యండి’
Published Tue, Feb 25 2020 9:02 AM | Last Updated on Tue, Feb 25 2020 9:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment