
బెయిలొచ్చినా.. ఇంకా జైల్లోనే!
పటేళ్ల ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ కు రాజద్రోహం కేసులో బెయిల్ లభించినా.. అతడు మాత్రం ఇంకా కొన్నాళ్ల పాటు జైల్లోనే ఉండాల్సి వస్తోంది. రాజద్రోహం కేసులో మాత్రం అతడికి దాదాపు 9 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. గుజరాత్ హైకోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆరు నెలల పాటు గుజరాత్ వెలుపల ఉండాలని ఆదేశించింది.
అంతవరకు బాగానే ఉన్నా.. హార్దిక్ పటేల్ మీద మరో కేసు ఉందని.. అందువల్ల ఆ కేసులో మాత్రం అతడు ఇంకా జైల్లోనే ఉండాల్సి వస్తుందని, అ కేసులో కూడా బెయిల్ వస్తేనే బయటకు రావడానికి వీలవుతుందని అతడి తరపు న్యాయవాది జుబిన్ భద్ర తెలిపారు.