హార్దిక్ పటేల్కు ఎదురుదెబ్బ
అహ్మదాబాద్: పటీదార్ అనామత్ ఆందోళన సమితి నేత హార్దిక్ పటేల్కు గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన దేశద్రోహం కేసును సవాల్ చేస్తూ హార్దిక్ వేసిన పిటీషన్ను హైకోర్టు తిరస్కరించింది.
సూరత్లో హార్దిక్పై దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పటేల్ యువకులు ఎవరూ ఆత్మహత్య చేసుకోరాదని, అవసరమైతే ఇద్దరు పోలీసులను చంపాలంటే హార్దిక్ చేసిన వ్యాఖ్యలపై సూరత్ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఇక రాజ్కోట్లో జరిగిన భారత్, దక్షిణాఫ్రికాల వన్డే సందర్భంగా జాతీయ జెండాను అవమానించాడంటూ మరో కేసు నమోదైంది. దీన్ని సవాల్ చేస్తూ హార్దిక్ హైకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్ను కొట్టివేసింది.