మరింత చిక్కుల్లో దినకరన్‌ | sedition Case against Dinakaran | Sakshi

దినకరన్‌ పై దేశ ద్రోహం​కేసు

Oct 3 2017 8:59 AM | Updated on Oct 20 2018 5:44 PM

sedition Case against Dinakaran - Sakshi

సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేపై తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్న శశికళ మేనల్లుడు టీవీవీ దినకరన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసినట్లు సేలం పోలీసులు ప్రకటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలు పంచటమే అందుకు కారణమని తెలుస్తోంది. 

నీట్‌ పరీక్ష విషయంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభించిన వైఖరిని తులనాడుతూ.. హత్యా ప్రభుత్వాలుగా అభివర్ణిస్తూ దినకరన్‌ వర్గానికి చెందిన నేతలు గత నెల 18న కరపత్రాలు పంచారు. ప్రభుత్వ వ్యతిరేక రాతలు రాయటం.. తద్వారా ప్రభుత్వంపై తిరుగుబాటు వేయాలంటూ ప్రజలకు దినకరన్‌ పిలుపునిచ్చారంటూ వినాయకమ్‌ అనే వ్యక్తి సేలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దినకరన్‌తోపాటు ఆయన మద్ధతుదారులు 16 మందిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టయినవారిలో మాజీ మంత్రి సేఈ వెంకటాచలం కూడా ఉన్నట్లు సమాచారం.  

కాగా, తమదే అసలైన పార్టీ అని దినకరన్‌ వర్గం.. ఎలాగైనా అధికారం చేజార్చుకోనివ్వకుండా పళని-పన్నీర్‌ వర్గాలు పోటాపోటీగా తమ ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నాయి.  ఓవైపు దినకరన్‌ గవర్నర్‌ను ఎప్పటికప్పుడు కలుస్తూ బలనిరూపణకు ప్రభుత్వాన్ని ఆదేశించాని కోరుతుండగా.. పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాలు నడుపుతున్న వారికి అనర్హత వేటు ద్వారా చెక్‌ పెట్టాలని పళని ప్రయత్నిస్తూ వస్తున్నారు.  ఈ క్రమంలోనే సెప్టెంబర్‌ 18న దినకరన్‌తోపాటు ఆయన సన్నిహితుడు, తిరుగుబాటు ఎమ్మెల్యేలో ఒకరైన వెట్రైవెల్‌ పై వేటు వేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది కూడా.  ఇప్పటికే దినకరన్‌ పై మనీలాండరింగ్‌, ఈసీకి లంచం ఇవ్వజూపారన్న కేసులు నమోదైన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement