
కొచ్చి: లక్షద్వీప్ పోలీసులు నమోదు చేసిన దేశద్రోహం కేసులో సినీనటి, దర్శకురాలు ఆయేషా సుల్తానాకు ఊరట లభించింది. ఈ కేసులో ఒకవేళ అమెను అరెస్టు చేస్తే వారంరోజులపాటు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని లక్షద్వీప్‌లోని కవరత్తి పోలీసులను కేరళ హైకోర్టు ఆదేశించింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయేషా సుల్తానా దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం గురువారం తీర్పును రిజర్వ్ చేసింది.
ఈ కేసులో తదుపరి విచారణ కోసం జూన్ 20న తమ ఎదుట హాజరు కావాలంటూ లక్షద్వీప్‌లోని కవరత్తి పోలీసులు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయేషా సుల్తానాకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశోక్ మీనన్ సూచించారు. రూ.50 వేల పూచీకత్తు, ఇద్దరి హామీతో ఆయేషా సుల్తానాకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొచ్చని తెలిపారు. లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం జీవాయుధాలను ప్రయోగిస్తోందని జూన్ 7న ఆరోపించిన ఆయేషా సుల్తానాపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: మాజీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు ప్రదీప్ శర్మ అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment