అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ (ఆమ్నేస్టీ)పై కర్ణాటకలో రాజద్రోహం కేసు నమోదు అయింది.
బెంగళూరు: అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ (ఆమ్నేస్టీ)పై కర్ణాటకలో రాజద్రోహం కేసు నమోదు అయింది. కశ్మీర్లో మానవ హక్కులపై అమ్నేస్టీ సంస్థ శనివారం బెంగళూరులో సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో కశ్మీరీలు ఆజాదీ నినాదాలు చేశారు. దీంతో అమ్నేస్టీ సదస్సు జాతి వ్యతిరేకమంటూ ఏబీవీపీ ఫిర్యాదు చేసింది. దేశానికి వ్యతిరేకంగా కొందరు ప్రసంగాలు చేశారని ఏబీవీపీ తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అమ్నెస్టీ సంస్థతో పాటు మరికొందరిపై కర్ణాటక పోలీసులు సోమవారం రాజద్రోహం కేసు నమోదు చేశారు. కాగా తమకు ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ అందలేదని ఆమ్నేస్టీ కర్ణాటక విభాగం తెలిపింది.