సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రేవ్ పార్టీలో సినీ ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. మరోవైపు.. బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు తీగలాగుతున్నారు. ఇందులో భాగంగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.
కాగా, ‘సన్‌సెట్ టూ సన్‌రైజ్ విక్టరీ’ పేరుతో వ్యాపారి, క్రికెట్ బూకీ వాసు వ్యక్తి తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. పార్టీ దాదాపు 150 మంది ప్రముఖులు హాజరయ్యారు. బర్త్ డే పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు రేవ్ పార్టీ జరిగేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ ఈవెంట్ మొత్తానికి అరుణ్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. వాసు బర్త్‌డే పార్టీకి డగ్ర్ పెడ్లర్లు సిద్ధిఖీ, రణధీర్, రాజ్ కూడా రావడంతో డ్రగ్స్ వాడినట్టు తెలుస్తోంది.
మరోవైపు.. రేవ్ పార్టీ ఇచ్చిన క్రికెట్ బూకీ వాసు నేపథ్యంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రముఖులతో వాసుకు ఉన్న లింకులపై పోలీసులు విచారణ చేపట్టారు. వాసుపై ఉన్న పాత కేసులపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక, రేవ్ పార్టీలు, డ్రగ్స్ పార్టీలపై హైదరాబాద్‌లో నిఘా పెరగడంతో బెంగళూరులో ఇలా పార్టీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ పార్టీకి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. వీరంతా రెండు రోజులుగా బెంగళూరు జీఆర్ ఫామ్‌హాస్‌లో మకాం వేసినట్టు సమాచారం.
ఇక, నిన్న రేవ్ పార్టీపై రైడ్ సందర్భంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ పార్టీలో తెలుగు, కన్నడ, తమిళ సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే వాసు, అరుణ్, సిద్ధిఖీ, రణధీర్, రాజ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి వైద్య పరీక్షలు రేవ్ పార్టీలో పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకున్నామని, రక్తం నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రేవ్‌పార్టీలో 150 మంది ఉన్నారని డాగ్ స్క్వాడ్‌ను పిలిపించి తనిఖీలు చేపట్టామని, కొన్ని మాదకద్రవ్యాలు లభించాయని కర్ణాటక పోలీసులు వివరించారు. ‘సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ’ పేరిట రేవ్ పార్టీ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. సుమారు 15.56 గ్రా. ఎండీఎంఏ, 6.2 గ్రా. హైడ్రో గంజాయి, కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment