జైపూర్: విద్యార్థినులపై మృగాళ్ల ఆకృత్యాలు అంతకంతకూ శృతి మించితూనే ఉన్నాయి. విద్యార్థులకు విద్యాబుద్ధులుతో పాటు వారు భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన స్కూల్ డైరెక్టర్ తప్పుదారి పట్టాడు. విద్యార్థినులను లైంగికంగా వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తూ, చివరకు క్రిమినల్ కేసులో చిక్కుకున్నాడు . ఓ విద్యార్థినిపై లైంగిక వేధించాడనే ఆరోపణలతో జోబ్నగర్ పట్టణంలోని ఠాగూర్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ భన్వర్ లాల్ చౌదరినీ సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఠాగూర్ పబ్లిక్ స్కూల్ లో హాస్టల్ లో ఉండి సీనియర్ సెకెండరీ చదువుతున్న విద్యార్థినిని డైరెక్టర్ భనర్వాల్ లైంగిక వేధించసాగాడు. ఆ క్రమంలోనే డి సెంబర్ 13 వ తేదీన విద్యార్థినిపై అత్యాచారం చేయడానికి కూడా యత్నించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అతన్ని అరెస్టు చేసిన పోలీసులు సోమవారం జైపూర్ స్థానిక కోర్టులో ప్రవేశ సెట్టారు.