
స్కూళ్లకు సంక్రాంతి సెలవుల్లో మార్పు
12 నుంచి 16 వరకు సెలవులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలలకు ప్రకటించిన సంక్రాంతి సెలవుల తేదీలను ప్రభుత్వం మార్పు చేసింది. ఈనెల 12 నుంచి 16 వరకు సెలవులుగా ప్రకటించింది. ముందుగా ప్రకటించిన అకడమిక్ కేలండర్ ప్రకారం ఈనెల 11 నుంచి 15 వరకు సెలవులుండగా, వాటిని మారుస్తూ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం ఈనెల 12 నుంచి 16 వరకు పాఠశాలలకు సెలవులు వర్తిస్తాయి.