ఒక చోట విద్యార్థులు లేరు మరో చోట టీచర్లు లేరు | In another place, a place where there are no teachers, not students | Sakshi
Sakshi News home page

ఒక చోట విద్యార్థులు లేరు మరో చోట టీచర్లు లేరు

Published Thu, Jul 14 2016 12:44 AM | Last Updated on Sat, Sep 15 2018 5:49 PM

In another place, a place where there are no teachers, not students

ప్రభుత్వ పాఠశాలల తీరిది..
జిల్లాలోని సర్కారు బడులు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు మెరుగైన బోధన అందించి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. ఉపాధ్యాయులున్న చోట విద్యార్థులు లేకపోవడం.. టీచర్లు ఎక్కువగా ఉన్న చోటకు విద్యార్థులు రాకపోవడంతో పాఠశాలల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో  జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల తాజా పరిస్థితిపై ప్రత్యేక కథనం.
 
వందకు ఒక్కడు
జామతండా (నెల్లికుదురు) : మండలంలోని జామతండా ప్రాథమిక పాఠశాలలో 5 తరగతులు ఉన్నారుు. ఈ పాఠశాలలో వంద మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నారుు. పాఠశాలకు ఒకే గది ఉండడంతో కొందరిని వరండాలో, మరి కొందరిని గదిలో కూర్చోబెట్టి ఉపాధ్యాయుడు లింగమూర్తి తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం 2012-13లో ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ పట్టింపులేనితనంతో పనులు నత్తనడకన సాగుతున్నారుు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని తండావాసులు కోరుతున్నారు.
 
84 మందికి ఇద్దరు ఉపాధ్యాయులు
మహబూబాబాద్ : విద్యార్థులు లేక కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఖాళీగా కూర్చుం టుండగా.. మరికొన్ని బడుల్లో టీచర్ల కొరత పట్టిపీడిస్తుంది. మానుకోట పట్టణ పరిధిలోని నందమూరినగర్‌కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో 1 నుంచి 5 తరగతుల్లో 84 మంది విద్యార్థులుండగా.. ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. పాఠశాలకు పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరవుతున్నప్పటికీ ఉపాధ్యాయులు తగినంత మంది లేకపోవడంతో బోధన కుంటుపడుతోంది. పాఠశాలలో మూడు తరగతి గదులు ఉం డగా, అందులో ఒక గదిని స్టాఫ్‌రూంకు కేటారుుంచగా మిగిలిన గదుల్లోనే 5 తరగతులను నిర్వహిస్తున్నారు. పాఠశాల పక్కనే ఉన్న మునిసిపాలిటీ బావికి జాలి ఏర్పాటు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీర్చి పిల్లలకు మెరుగైన బోధన అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
 
ఖాళీగా కొర్రతండా ప్రాథమిక పాఠశాల
జనగామ : విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల బాధ్యతారాహిత్యం కారణంగా మండలంలోని పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలపోతున్నారుు. మండలంలోని గానుగుపహాడ్ శివారు కొర్రతండా ప్రాథమిక పాఠ శాలకు కొన్ని నెలల నుంచి విద్యార్థులు రావడం లేదు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమంలో ఐదుగురు విద్యార్థులు చేరారు. అరుుతే పాఠశాల పునఃప్రారంభం రోజు నుంచి విద్యార్థుల సంఖ్య పెరగకపోవడంతో బడిబాటలో పేర్లు నమోదు చేసుకున్న ఐదుగురిలో ముగ్గురు విద్యార్థులు గానుగుపహాడ్ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు. దీంతో ఉన్న ఇద్దరు విద్యార్థులు కూడా కొద్ది రోజులుగా గైర్హాజరవుతుండడంతో తరగతి గదులు బోసిపోయి కనిపిస్తున్నాయి. విద్యార్థులు లేని కారణంగా ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయుల్లో వెంకటేశ్వర్లు అనే టీచర్‌ను డిప్యూటేషన్‌పై పెదరామన్‌చర్ల పాఠశాలకు పం పించారు. మరో ఉపాధ్యాయుడు ఖదీర్ రోజు పాఠశాలకు వచ్చి ఖాళీగా కూర్చుని వెళ్తున్నారు. కాగా, తరగతి గదుల్లో సొసైటీ అధికారులు గన్నీ బ్యాగులను నిల్వ చేయడం గమనార్హం.
 
ఎర్రగొల్లపహాడ్‌లోనూ అంతే..
 మండలంలోని ఎర్రగొల్లపహాడ్ పెద్దతండా పరిధిలోని పీఎస్‌కు ఒక్క విద్యార్థి కూడా రావడం లేదు. అడవికేశ్వాపూర్ శివారు దోనాబాయి తండా పాఠశాలకు విద్యార్థులు రావడం లేదనే కారణంతో ఇక్కడ పనిచేస్తున్న ఏకైక ఉపాధ్యాయురాలు సెలవుపై వెళ్లడంతో బుధవారం పాఠశాలకు తాళం పడింది. అడవికేశ్వాపూర్ శివారు బాకర్‌నగర్ తండా పాఠశాలకు కేవలం నలుగురు విద్యార్థులు మాత్రమే వస్తున్నట్లు తెలుస్తుంది. దోనాబాయి తండాలో విద్యార్థులు రావడంలేదని ఉపాధ్యాయురాలు కవిత సెలవుపై వెళ్లినట్లు ఎంఈఓ భద్రొద్దీన్ తెలిపారు.
 
 73 మందికి అంతే..
 దుగ్గొండి : మండలంలోని రేకంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 2013-14లో విద్యార్థులు లేక మూతపడింది. దీంతో 2014-15లో గ్రామస్తులు తమ ఊరికి చెందిన విద్యార్థులు సుమారు 54 మందిని చేర్పించి పాఠశాలకు ప్రా ణం పోశారు. అరుుతే 54 మందికి ఒకే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉండటంతో గ్రామస్తులు మరో ముగ్గురు ప్రైవేట్ ఉపాధ్యా యులను నియమించుకున్నారు. వారికి తలాకొంత చందాలు వేసుకుని వేతనాలు చెల్లించారు. ఈ క్రమంలో పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థులు 5వ తరగతిలో తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఎంట్రెన్స్ రాసి సీట్లు సాధించారు.  ప్రస్తుతం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 73కు చేరినా ప్రభుత్వం అదనపు ఉపాధ్యాయులను నియమించలేదు. దీంతో ఒక్క ఉపాధ్యాయుడే అంతమంది విద్యార్థులకు పాఠాలు బోధించడం కష్టంగా మారిందని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని వారు కోరుతున్నారు.
 
టీచర్లు ఎక్కువ.. విద్యార్థులు తక్కువ
 మండల పరిధిలోని చాపలబండ ప్రభుత్వ పాఠశాల కొన్ని నెలల క్రితం 8వ తరగతి వరకు అప్‌గ్రేడ్ అయింది. ఈ పా ఠశాలలో ఆరుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అరుుతే విద్యార్థుల సంఖ్యను 58గా రికార్డుల్లో చూపుతున్నప్పటికి వాస్తవంగా ఇక్కడ 8 తరగతులకు 34 మందే హాజరువుతున్నట్లు సమాచారం.
 
 
‘వెంకటాపురం’ వెలవెల

 తొర్రూరు : మండలంలోని వెంకటాపురం హరిజనకాలనీ లో కొన్నేళ్ల క్రితం ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశా రు. ఇందులో 1 నుంచి 5 తరగతులు ఉన్నారుు. రెండేళ్ల నుంచి ఇక్కడి పాఠశాలకు విద్యార్థులు రావడంలేదు. దీంతో పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరిని వేరే స్కూల్‌కు బదిలీ చేశారు. ఇటీవల బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేపట్టినప్పటికీ ఒక్క విద్యార్థి కూడా పాఠశాలకు రాకపోవడం గమనార్హం. కాగా, పాఠశాల పునః ప్రారంభంలో ఐదుగురు విద్యార్థులు అడ్మిషన్ పొందినప్పటికీ వారు ఒక్క రోజు హాజరుకాలేదని ఉపాధ్యాయురాలు రత్నకుమారి తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఉందని.. అందుకే తమ పిల్లలను అక్కడికి పంపిస్తున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు.
 
ఆరుగురు విద్యార్థులు.. ఇద్దరు టీచర్లు
కేసముద్రం : ప్రభుత్వ పాఠ శాలల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని కేసముద్రంస్టేషన్ శివారు బ్రహ్మంగారితండా ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు. ఈ పాఠశాలకు సొంతభవనం లేకపోవడంతో తండాలోని ఓ అద్దె ఇంటిలో తరగతులు నిర్వహిస్తున్నారు. ధన్నసరి శివారు బోడతండాలోని ప్రాథమిక పాఠశాలలో ఆరుగురు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తుండడం గమనార్హం. బుధవారం మధ్యాహ్నం పాఠశాలను ‘సాక్షి’ సం దర్శించగా ఆ సమయంలో ఉపాధ్యాయులు కనిపించలేదు. ఒక ఉపాధ్యాయుడు రాలేదని, మరొకరు వచ్చి మధ్యాహ్నమే వెళ్లిపోవడంతో పిల్లలు ఇంటికి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు.
 
 ఇటు కొంచెం.. అటు కొంచెం
సంగెం : మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. విద్యార్థులు ఎక్కువగా ఉన్నచోట ఉపాధ్యాయులు లేరు. టీచర్లు ఎక్కువగా ఉన్న చోట విద్యార్థులు లేకపోవడంతో విద్యాభివృద్ధి కుంటుపడుతోంది. మండలంలో 42 ప్రాథమిక, 7 ప్రాథమికోన్నత పాఠశాలు ఉన్నాయి. వీటన్నింటిలో 102 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా.. 3,343 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గవిచర్ల ప్రాథమిక పాఠశాలలో 160 మంది విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులే పాఠాలు బోధిస్తున్నారు. తిమ్మాపురం ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. కాగా, నల్లబెల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 25 మంది విద్యార్థులకు ఐదుగురు టీచర్లు, ఆశాలపల్లి ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులకు 4గురు టీచర్లు, నల్లబెల్లి శివారు బాలునాయక్ తండాలో 12 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
 
విద్యార్థుల కోసం ఎదురుచూపులు
మహబూబాబాద్ రూరల్ : మండలంలోని పలు పాఠశాలలకు విద్యార్థులు రాకపోవడంతో వెలవెలబోతున్నారుు. మండలంలోని శనిగపురం శివారు కుమ్మరికుంట్ల తండా ప్రాథమిక పాఠశాలకు కొన్ని నెలల నుంచి విద్యార్థులు హాజరుకావడంలేదు. దీంతో ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పిల్లల కోసం నిత్యం ఎదురుచూస్తూ ఖాళీగా కూర్చుంటున్నారు. వేంనూరు శివారు చిన్నకిష్టాపురం ప్రాథమిక పాఠశాలకు కూడా విద్యార్థులు రావడం లేదు. ఈ గ్రామానికి చెందిన విద్యార్థులను తల్లిదండ్రులు వేంనూర్ యూపీఎస్‌కు పంపిస్తున్నారు. అయోధ్య పం చాయతీ పరిధిలోని వెంక్యాతండా ప్రాథమిక పాఠశాలలో, లక్ష్మీపురం గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం తండా పీఎస్‌లో కూడా విద్యార్థులు లేరు. వీఎస్ లక్ష్మీపురం శివారు దేవులతండా, ఎర్రబోడు తండా పాఠశాలల్లో ఇద్దరు చొప్పున విద్యార్థులు ఉండడం గమనార్హం.  బేతోలు ఉర్దూ మీడియం పాఠశాలలో కూడా విద్యార్థులు లేరు. మల్యాల శివారు దేవులతండా పాఠశాలకు తరగతి గదులు లేకపోవడంతో విద్యార్థులు రావడం లేదని తెలిసింది. రామోజీ తండా, మాధవాపురం శివారు తేజావత్‌తండా, సీసీ తండా, తూర్పుతండా, రెడ్యాల శివారు టేకులతండా గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా లేరు.
 
 200 మంది.. ఐదుగురు టీచర్లు
 మడికొండ : నగర శివారులోని మడికొండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 200 మంది విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులు మాత్రమే బోధనలు చేస్తున్నారు. ఈ పాఠశాలలో గత  ఏడాది 70 మంది విద్యార్థులు ఉండగా.. ప్రస్తుత విద్యాసంవత్సరం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో 130 మంది ఆడ్మిషన్లు పొందారు. మడికొండ సమీపంలోని ధర్మసాగర్ మండల కేంద్రం నుంచి కూడా 10 మంది విద్యార్థులు స్కూల్‌కు వస్తున్నారు. పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు, తరగతి గదులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తక్షణమే ఉపాధ్యాయుల నియూమకం చేపట్టి విద్యార్థులకు మెరుగైన బోధనలు అందించాలని స్థానికులు కోరుతున్నారు.
 
60 మందికి సింగిల్ టీచర్
 నర్సింహులపేట : మండలంలోని బొజ్జన్నపేట పీఎస్‌లో 60 మంది విద్యార్థుల కు ఒక్క ఉపాధ్యాయురాలు మా త్రమే పాఠాలు బోధిస్తున్నారు. యూపీఎస్‌గా ఉన్న బొజ్జన్నపేట స్కూల్‌ను ఉపాధ్యాయుల కొరతతో కారణంగా పీఎస్‌కు కుదించారు. దీంతో 1 నుంచి 5 తరగతులకు ఒకే ఉపాధ్యాయురాలు పాఠాలు చెబుతోంది. విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement